Bollywood: ఈ హీరోయిన్ లైఫ్ నాశనం కావడానికి కారణమిదేనా?

Bollywood: సినీ తారల జీవితాలు తెరమీద చూపేంత అందంగా ఉండవు. కొందరు నటీనటులు స్టార్ డమ్ రాగానే అదే శాశ్వతం అని బతుకుతుంటారు. ఆ టైంలో అవగాహన లేక చేసే కొన్ని తప్పులు వారిని కోలుకోలేని స్థితికి చేరుస్తుంటాయి. తీరా వారి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. ఇక వారు జీవితాంతం తమ తప్పులను తెలుసుకుని బాధపడుతూనే ఉంటారు.

 

బాలీవుడ్ నటి అను అగర్వాల్ పరిస్థితి కూడా అలాగే మారింది. 1990లో ఆషికి అనే సినిమా ద్వారా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా బొమ్మరిల్లు లెవెల్లో హిట్ అవ్వడంతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఆ తర్వాత చేసిన చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. అంతేవేగంగా ఆమెకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తర్వాత 1999లో జరిగిన ఊహించని ప్రమాదం ఆమె జీవితాన్ని మొత్తం మార్చేసింది. దీంతో ఓ నెల రోజుల పాటు ఆమె తన గతాన్ని మర్చిపోయింది.

 

యోగా, ధ్యాన ప్రక్రియల ద్వారా తిరిగి తన గతాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం తన పేరిట ఫౌండేషన్ నెలకొల్పి యోగా క్లాసులు నిర్వహిస్తూ బతుకుతోంది. అయితే తన వ్యక్తిగత జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని అను ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. సహజీవనం వల్ల తాను ఏం కోల్పోయానో తెలిసివచ్చిందని వెల్లడించింది. స్టార్ డమ్ ఉన్నప్పుడు ఓ వ్యక్తితో సహజీవనం చేశానని, అతని తల్లి కూడా తనను అంగీకరించిందని తెలిపింది.

 

ఆమె స్నేహితులు తన గురించి చెడుగా చెప్పేవారని, పత్రికల్లో తన గురించి రాసిన, వచ్చిన వార్తలను నిజమని నమ్మేవారని, దాంతో తన జీవితం తలకిందులైనట్లు తెలిపింది. రూమర్లను ఖండించడానికి అప్పట్లో సోషల్ మీడియా లేదని, తానను తాను రక్షించుకోవడానికి ఎలాంటి మార్గం లేకుండా పోయిందని, దీంతో వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయానంటూ అను అగర్వాల్ కంటతడి పెట్టింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -