Pavitra Lokesh: ఐఏఎస్ కావాల్సిన పవిత్ర లోకేశ్ చేసిన తప్పు ఇదేనా?

Pavitra Lokesh: సీనియర్ నటుడు నరేశ్ తన సహ నటి అయిన పవిత్రా లోకేష్ ను పెళ్లి చేసుకోనున్నాడు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి తెలుగు మీడియాలో వారిద్దరి పేర్లు మార్మోగిపోతున్నాయి. దీంతో పవిత్ర లోకేశ్ ఎవరని, ఆమె బ్యాగ్రౌండ్ ఏంటని అందరూ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం గూగుల్ లో ఆమె గురించి సెర్చ్ చేస్తున్నారు. గ‌త ఏడాదిన్నర కాలంగా ప‌విత్ర‌, న‌రేష్ పేరు ఎంత హాట్ టాపిక్‌ మారిందో అందరికీ తెలిసిందే. మీడియాలో ఇప్పుడు వీరిద్దరి గురించి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ప‌విత్ర బ్యాగ్రౌండ్ విష‌యానికి వ‌స్తే ప‌విత్ర స్వ‌స్థ‌లం క‌ర్ణాటక కాగా ఆమె తండ్రి మైసూర్ లోకేష్ కూడా న‌టుడే కావడం విశేషం. తన తండ్రి వల్ల ఆమెకు చిన్న‌ప్ప‌టి నుంచే న‌ట‌న ప‌ట్ల ఆస‌క్తి ఏర్పడిందని చెప్పొచ్చు. తండ్రి చ‌నిపోయాక కుటుంబ పోష‌ణ నిమిత్తం ఆమె సినిమాల్లో చిన్నా చిత‌కా పాత్ర‌లు చేస్తూ సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు. పవిత్ర లోకేశ్ కు ఐఏఎస్ కావాల‌న్న‌ది లక్ష్యంగా ఉండేది. అయితే సొంతంగా త‌న కాళ్ల మీద తాను నిల‌బ‌డేందుకు ఆమె 16 ఏళ్ల వ‌య‌స్సులోనే క‌న్న‌డ టీవీ న‌టిగా కెరీర్ ను మొదలు పెట్టారు.

1994లో క‌న్న‌డ రెబ‌ల్ స్టార్ అంబ‌రీష్ హీరోగా న‌టించిన మిస్ట‌ర్ అభిషేక్ సినిమాలో ఆమె అంబ‌రీష్‌కు జోడీగా చేసి మంచి మార్కులు పొందారు. అప్ప‌ట్లో ఆమె అంద‌చందాల‌తో క‌న్న‌డ సినీ జ‌నాలు ఫిదా అయిపోయారని చెప్పొచ్చు. ప‌విత్ర‌కు గొప్ప అంద‌గ‌త్తె అన్న పేరు ఉండటంతో పాటు హైట్ కు త‌గిన ప‌ర్స‌నాలిటీ లేద‌ని ఇండస్ట్రీలో చెప్పుకునేవారు. దీంతో ఆమెకు హీరోయిన్‌గా ఛాన్సులు రాక‌పోవ‌డంతో ఆమె క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా సెటిల్ అయ్యిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

సినిమాల్లోకి ఎప్పుడు అయితే ఎంట‌ర్ అయ్యిందో అక్కడి నుంచి బిజీ అయిపోయింది. ఆ త‌ర్వాత క‌న్న‌డ‌తో పాటు తెలుగులోనూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు 150కు పైగా సినిమాల్లో ఆమె నటించారు. ఆమె నాయి నేరాలు అనే క‌ర్నాట‌క సినిమాకు స్టేట్ అవార్డు కూడా లభించింది. ప‌విత్ర భ‌ర్త సుచేంద్ర ప్ర‌సాద్ కూడా టీవీ సీరియ‌ల్ న‌టుడు కావడం విశేషం. అంత‌కుముందే ప‌విత్ర ఓ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ అయిన యువ‌కుడిని పెళ్లాడి ఏడాదికే విడాకులు తీసుకుంది. ప్రస్తుతం నరేశ్ తో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేందుకు ఆమె సిద్ధంగా ఉంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -