Janasena: పవన్ స్టేట్మెంట్ గురించి జనసైనికుల్లో అలాంటి అభిప్రాయమా?

Janasena: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది, రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తమ వైఖరిని ఆయా పార్టీల కార్యకర్తలను వివరిస్తున్నాయి. ఏపీలో జనసేన పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోయినా, ఆ పార్టీకి గతం కన్నా ఓటు శాతం పెరిగిందనే చెప్పవచ్చు. అయితే సీఎం అయ్యే స్థాయిలో ఓటింగ్ లేకపోయినా, ఆ పార్టీ నేతలు, అభిమానులు మాత్రం పవన్ సీఎం కావాలని కోరుకుంటారు. కానీ తాజాగా పవన్ తన వ్యూహాన్ని ప్రకటించారు.

జనసేన అధినేత పవన్ 2024 అసెంబ్లీ ఎన్నికల ముంగిట తన రాజకీయ వైఖరిని స్పష్టం చేసేశారు.తెలుగుదేశం పార్టీతో పొత్తు కచ్చితంగా ఉంటుందని సంకేతాలు ఇచ్చేశారు. తాను సీఎం పదవికి పోటీలో లేనని స్పష్టత చెప్పారు. నిజాయితీగా పవన్ చేసిన ప్రకటన రాజకీయంగా పెద్ద చర్చకే దారి తీసింది. పవన్ చేసిన ప్రకటన పట్ల తెలుగుదేశం మద్దతు దారులు సానుకూలంగా స్పందించారు.

 

అయితే ఈ ప్రకటనపై రాజకీయ జ్ఞానం లేని జనసేన కార్యకర్తల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. వాళ్లు ఈ స్టేట్మెంట్ విషయంలో ఎలా స్పందించాలో తెలియని అయోమయంలో కనిపిస్తున్నారు. పవన్ వాస్తవానికి దగ్గరగా మాట్లాడాడని కొందరు జనసైనికులు అంటుంటే, మరికొందరు మాత్రం సీఎం కావాలని కోరుకుంటున్నారు. సీఎం ఎందుకు కాలేమనే విషయాన్ని కూడా పవన్ స్పష్టంగా అర్ధమయ్యే రీతిలో పార్టీ కార్యకర్తలకు చెప్పారు. అయినప్పటికీ కొందరిలో అసంతృప్తి ఉంది.

 

వాస్తవ బలం ఎంత ఉన్నప్పటికీ పైకి మాత్రం గాంభీర్యాన్ని ప్రకటించాలని పైకి పట్టుదలగా కనిపిస్తేనే, పొత్తులప్పుడు ఎక్కువ ప్రయోజనం దక్కుతుందని అంటున్నారు. కాలం కలిసొచ్చి కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం వస్తే సీఎం పదవిని కూడా డిమాండ్ చేయొచ్చని వారంటున్నారు. సమయం వచ్చినపుడు చూద్దాం అని విషయాన్ని దాటవేస్తే బాగుండేదని ఆ వర్గం అంటోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -