Sai Pallavi: సాయి పల్లవి అలా కనిపించడం వెనుక అసలు కథ ఇదేనా?

Sai Pallavi: తెలుగు సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఫిదా మూవీతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది. మరి ముఖ్యంగా తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ యూత్ లో భారీగా క్రేజ్ ని ఏర్పరచుకుంది ఈ బ్యూటీ. ఇక ఈ ముద్దుగుమ్మ అందానికి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

నాచురల్ బ్యూటీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. కాగా సాయి పల్లవి ఇప్పటివరకు తెలుగులో ఫిదా, లవ్ స్టోరీ, విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్, ఎంసీఏ, పడి పడి లేచే మనసు, మారి 2 లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఇటీవలే గార్గి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. ఇది ఇలా ఉంటే సాయి పల్లవి నాచురల్ అందం గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తన అందం సీక్రెట్ గురించి తెలిపింది.. ఇంటర్వ్యూ లో భాగంగా సాయి పల్లవి మాట్లాడుతూ..

 

డైటింగ్స్ ఎక్సర్ సైజ్ లు, యోగా, జాగింగ్ ఇలాంటివి ఏవి చేయను. కేవలం నచ్చిన ఫుడ్ ని ఇష్టంగా నాలుగు సారు అయినా తింటాను. అయితే కచ్చితంగా రోజుకి ఒక గంట అయినా డ్యాన్స్ చేస్తాను అది నా హ్యాబిట్. ఆ కారణంగానే నేను ఇలా ఉండగలుగుతున్నాను అని తెలిపింది సాయి పల్లవి. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఇంత అందంగా హాట్ గా కనిపించడానికి కారణం ఆమె చేసే డాన్స్ నేనా అంటూ సాయి పల్లవి సింప్లిసిటీ పై నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతోంది అంటూ ఎన్నో రకాల ఊహాగానాల వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -