Viveka Case: వివేకా కేసులో అసలు ట్విస్ట్ ఇదేనా.. రాబోయే రోజుల్లో అలా జరగనుందా?

Viveka Case: తాజాగా ఏపీలో ఆర్కే వివేకా హత్య కేసు ఎత్తిపోయినట్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో అది కాస్త ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. కాగా సీబీఐ కోర్టులో వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటును జగన్ రెడ్డి సొంత మీడియాలో చేతులెత్తేసిన సీబీఐ అన్నట్లుగా ప్రచారం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికి వివేకా హత్య కేసు కథ కంచికి చేరినట్లేనని వచ్చే ఎన్నికల తర్వాత రెండు చోట్ల ప్రభుత్వాలు మారితే అప్పుడు సూత్రదారులు బయటకు రావొచ్చని ఆయన అంటున్నారు. రాజకీయపరమైన కేసులు కాకుండా ఇలా నేరుగా కుటుంబసభ్యులను సైతం ఘోరంగా హత్యలు చేసి దాన్ని డబ్బు, పలుకుబడి సహాయంతో బయటపడగలిగేలా వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయానని ఆర్కే ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన ఉద్దేశం ప్రకారం కేసు ఎత్తిపోవడం అంటే… సూత్రధారులుగా ఆర్కే భావిస్తున్న జగన్ రెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డిల దగ్గరకు కేసు రాకపోవడమే. అసలు హత్యకు ప్లాన్ చేసింది, పని పూర్తయ్యాక ఫినిష్ అని అందరి కంటే ముందుగా సమాచారం అందుకున్నది కూడా ఆ ఆది దంపతులేనని ఆర్కే నమ్మకం. ఆ విషయాన్ని కల్లం అజేయరెడ్డి తన వాంగ్మూలంలో కూడా చెప్పారని అన్నారు. ఫోన్ రికార్డులు ఉన్నాయని ఇప్పటికే సీబీఐ అధికారులు తేల్చారు. అయినా ఈ కేసులో సీబీఐ అధికారులు దూకుడుగా ఉండలేకపోవడానికి కారణం అత్యున్నత స్థాయిలో చేసిన ఒత్తిళ్లే అంటున్నారు. అవినాష్ రెడ్డిని చార్జిషీటు వరకూ అరెస్ట్ కాకుండా కాపాడటంలో జగన్ రెడ్డి సక్సెస్ అయ్యారని ఆర్కే చెబుతున్నారు.

 

కేసు పరిణామ క్రమం చూసిన వారికి అవినాష్ రెడ్డిలా వ్యవస్థల్ని ధిక్కరించి అరెస్ట్ కాకుండా ఉండటం అనేది ఆశ్చర్యకరంగా ఉంటుంది. తల్లిని తీసుకొచ్చి ఆస్పత్రిలో పెట్టి వారం రోజులు చుట్టూ మనుషుల్ని పెట్టకొని సీబీఐ అధికారులు రాకుండా ప్రొటెక్ట్ చేసుకుని కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారంటే అది మామూలు విషయం కాదని ఆర్కే అన్నారు. బీజేపీ పెద్దలే ఈ వ్యవస్థల అవ్యవస్థకు బాధ్యత వహించాలని అన్నారు. అయితే వివేకా కేసు సూత్రధారుల వద్దరు కాలేదు కానీ. అవినాష్ రెడ్డిని మాత్రం గట్టిగానే ఇరికించిందని ఆయన చెబుతున్నారు. ఆర్కే అనుకున్నట్లుగా జగన్, భారతి రెడ్డిల దగ్గరకు రాలేదని కేసు ఎత్తిపోయిందని చెబుతున్నారు. కానీ అవినాష్ రెడ్డిని మాత్రం కాపాడలేరని ఆర్కే అభిప్రాయంవ్యక్తం చేశారు. మొత్తంగా చూసుకుంటే ఆర్కే ఆర్టికల్ వివేకా కేసులో నిజాలు ఇంకా బయటకు రావాలని.. దాన్ని బీజేపీ పెద్దల సాయంతో జగన్ రెడ్డి అడ్డుకున్నారన్న సారాంశంతో సాగింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -