ABN RK: ఆర్కే చేసిన కామెంట్లు నిజమేనా.. వైసీపీ నిజంగా అలా చేస్తోందా?

ABN RK: ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకులో రాసే విషయాలు కంటే.. వాటి వెనుక ఉండే గూడార్థాలు ఎక్కువలా ఉంటాయి.అందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియకపోయినా దానినే నిజంగా చిత్రీకరించి చెప్పడంలో ఆర్కేకి మరెవరు సాటిరారని చెప్పాలి. ఇలా ఆర్కే పలుకుల ద్వారా ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఈయన ఈ వారం సరికొత్త వ్యూహం ద్వారా మరోసారి అందరిని ఆలోచింపజేశారు.

పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి నేతలు కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఇలా వాలంటీర్ల గురించి వివాదాస్పద వ్యూహం రచించినది వైసిపినే అంటూ ఈ సందర్భంగా రాధాకృష్ణ తన పలుకులు ద్వారా తెలియచేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.ఇక ఈ వివాదాన్ని పెద్దది చేస్తుంది కూడా వైఎస్ఆర్సిపి పార్టీని ఈయన తెలిపారు. దీని వెనుక సరికొత్త రాజకీయ వ్యూహం ఉందని ఈయన వెల్లడించారు.

 

వైఎస్ఆర్సిపి పార్టీ చేసే రాజకీయం చాలా భిన్నంగా ఉంటుంది అవతల వ్యక్తి ఫ్రస్టేషన్,వారి కోపతాపాలను గుర్తుపెట్టుకుని రాజకీయాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఆవేశాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి వీరు తనని ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసే విధంగా రెచ్చగొడుతున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు లేకుండా కేవలం బిజెపితో పొత్తు పెట్టుకొని మాత్రమే ఎన్నికల బరిలో నిలబడే విధంగా తనని రెచ్చగొడుతూ వాలంటీర్ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఆర్కే అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

అయితే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వంతో పొత్తుకు సిద్ధమై ఎన్నికల బరిలో దిగితే తమ విజయానికి ఆటంకం కలుగుతుంది అన్న భయం వైసిపి నేతలలో ఉందని అందుకే పవన్ కళ్యాణ్ ను రెచ్చగొడుతూ ఆయనని ఒంటరిగా ఎన్నికల బరిలో దిగేలా చేసి మరోసారి అధికారం అందుకోవడం కోసమే ఇలా చేస్తుందంటూ ఆర్కె తెలిపారు. ఇక ఆర్కె చేసిన ఈ కామెంట్స్ వైరల్ కావడంతో ఇది నిజమేనా అని వైసిపికి నిజంగానే ఓటమి భయం పట్టుకుందా అని పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -