Sharmila: వివేకా హత్యకు పెద్ద కారణం.. షర్మిల సంచలన వ్యాఖ్యలు వైరల్!

Sharmila: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షరాలు వైయస్ షర్మిలను సిబిఐ 259వ పేర్కొన్నారు. ఇలా ఈమెను కూడా ఈ హత్య కేసులో భాగంగా సాక్షిగా పేర్కొనడంతో సిబిఐ కోర్టుకు దర్యాప్తు సంస్థ వాంగ్మూలం సమర్పించింది.అయితే ఇంకా తేడాది అక్టోబర్ 7వ తేదీ ఈమె ఢిల్లీలో ఈ వాంగ్మూలం సమర్పించిన సంగతి మనకు తెలిసిందే. మరి ఈ వాంగ్మూలంలో ఏముంది షర్మిల ఎలాంటి వ్యాఖ్యలు చేశారనే విషయాన్ని వస్తే…

నా వద్ద ఎలాంటి ఆధారాలు లేవు కానీ ఇది మాత్రం రాజకీయ కోణంలో జరిగిన హత్యేనని షర్మిల తెలిపారు. ఇక వివేకానంద రెడ్డి హత్య కేసుకు కుటుంబ ఆర్థిక వ్యవహారాలు కారణం కాదు అంతకుమించినటువంటి కారణం ఉందని తెలిపారు.అవినాష్ కుటుంబానికి వివేకానంద రెడ్డి వ్యతిరేకంగా నిలబడటం కారణం కావచ్చు ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇలా చేసి ఉండవచ్చు అంటూ ఈమె వాంగ్మూలంలో తెలియజేశారు.

 

బాబాయ్ హత్యకు కొన్ని నెలల ముందు మా ఇంటికి వచ్చారు అక్కడ ఆయన నాతో మాట్లాడుతూ కడప ఎంపీగా తనని పోటీ చేయమని అవినాష్ కి టికెట్ ఇవ్వకుండా చేయాలని ఈ విషయంలో జగన్ ను ఎలాగైనా ఒప్పిద్దామంటూ తనతో మాట్లాడారని షర్మిల తెలిపారు.జగన్ కి వ్యతిరేకంగా తాను వెళ్ళనని బాబాయికి తెలుసు అలాగే తనని ఒప్పిస్తానన్న ధీమాతోనే నాతో ఈ విషయం చెప్పారని తెలిపారు.

 

జగన్ నాకు మద్దతు ఇవ్వరు కనుక మొదటిలో ఒప్పుకోలేదు కానీ బాబాయ్ పదేపదే ఈ విషయం చెప్పడంతో తాను కూడా సరే అన్నానని తెలిపారు. ఎంపీగా వివేకానంద రెడ్డి పోటీ చేయకుండా మీపై ఎందుకు ఒత్తిడి తెచ్చారనీ సిబిఐ ప్రశ్నించడంతో ఈమె సమాధానం చెబుతూ తాను ఎమ్మెల్సీగా ఓడిపోయినందుకు ఎంపీగా పోటీ చేయడానికి ఇష్టపడలేదేమో అంటూ షర్మిల వైయస్ వివేకానంద రెడ్డి గురించి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -