RK: రామోజీ వెంట్రుక కూడా జగన్ పీకలేరు.. వైరల్ అవుతున్న ఆర్కే సంచలన వ్యాఖ్యలు!

RK: ఏపీ సీఎం జగన్ వేదికపై బటన్ నొక్కి ప్రసంగంలో భాగంగా నా బొచ్చు కూడా పీకలేరు అనే డైలాగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్కే కూడా అలాంటి భాషను వాడారు. కానీ తెలివిగా నేరుగా అదే భాషలో మాట్లాడకుండా రామోజీ వెంట్రుక కూడా జగన్ పీకలేరు అని కొత్త పలుకు ద్వారా తేల్చేశారు. ఏపీ సీఎం ఎంత ప్రమాదకరమైన రాజకీయ ఆట ఆడుతున్నారో చెప్పడానికి ఈ వారం వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు వివరించారు. ఇలా చెప్పడం ఆయనకు సలహాలివ్వడం అవుతుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థుల ఆర్థిక మూలాల్ని దెబ్బతీయాలనుకుంటే, ఆ అధికారం మారితే ఏమవుతుంది అనే ఒక ప్రశ్నను జగన్ కి వదిలారు ఆర్కే.

అలాగే భారతి సిమెంట్ మూసి వేత తప్పదని అంటే ఇప్పటికీ భారతీ సిమెంట్ పై ఎన్నో కాలుష్య ఆరోపణలు ఉన్నట్లు నివేదికలు ఉన్నాయని తెలిపారు. లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ప్రభుత్వం పరిశ్రమల్ని ఎలా మూయించారో దారి చూపించింది. అ ప్రకారం జగన్ అధికారం పోయిన మరుక్షణం ఆయనకు చెందిన వ్యాపార సంస్థలు మనుగడ సాగించడం కష్టమే. భారతి సిమెంట్ కు ఒక్క ప్లాంటే ఉంది. బయట ఎక్కడా మరో ప్లాంట్ లేదు. అది వికాట్ అనే ఫ్రెంచ్ కంపెనీకి 51 శాతం వాటా అమ్మారు కానీ అతి ఉత్తుత్తికే అని కార్పొరేట్ వర్గాలకు తెలుసు. ఆ కంపెనీ తరపున పేరుకే డైరక్టర్లు ఉంటారు.

 

అలాగే నిర్వహణ లాభాలు వ్యాపారాలు మొత్తం జగన్ రెడ్డి కుటుంబ కనుసన్నల్లో ఉంటాయి. మామూలుగా మెజార్టీ వాటా ఉన్న వాళ్లు ఆ సంస్థను స్వాధీనం చేసుకుంటారు. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదంటేనే ఎంత గోల్ మాల్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక కార్మికులకు వేతనాలు దగ్గర నుంచి కాలుష్య నిబంధనలు పాటించడం వరకూ చాలా లోపాలు కూడా ఉన్నాయి. ఒక్క భారతీ సిమెంట్ మాత్రమే కాదు. జగన్ కి ఆర్థిక మూలాలు ఏపీలో ఎక్కువే ఉన్నాయి. అవి బయట ప్రపంచానికి తెలియవు. కానీ రాజకీయవర్గాలకు బాగా తెలుసు. వాటిని ఎలా దెబ్బకొట్టాలో అలా కొడతారు. కొట్టకపోతే చేతకానితనం అనుకుంటారు. ఇక జగన్ చూపించిన బాటలోనే ఆ పార్టీ ముఖ్య నేతల ఆర్థిక మూలాలను టార్గెట్ చేసుకుంటారు. వ్యాపారవేత్తలకు రాజకీయం అనేది తమ వ్యాపారాలకు అదనపు బలమే కానీ రాజకీయం కోసం తాము దివాలా తీయాలని అనుకోరు. అయితే ఈ విషయాలు అన్ని గుర్తుకు వచ్చేలా ఆర్కే తన తన కొత్తపలుకులను వివరించారు. ఇలా చెప్పడానికి మార్గదర్శిపై ప్రభుత్వం జరుపుతున్న ఏకపక్ష దాడుల్ని వాహకంగా ఉపయోగించుకున్నారు. అంతే కాదు.. రామోజీరావు కాలిగోటిని కూడా తాకలేరని తేల్చేశారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -