Naresh: నరేష్ మొదటి భార్య చనిపోవడం వెనుక రీజన్ ఇదేనా?

Naresh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యన వివాదాస్పద రీతిలోనే కాకుండా, సెన్సేషన్ గా ఎవరైనా నిలుస్తున్నారంటే అది నటుడు నరేష్. లేటు వయసులో మలయాళ ఇండస్ట్రీకి చెందిన పవిత్రా లోకేష్ తో మొన్నటి దాకా చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగి ఇతడు.. మైసూర్ లో ఓ హోటల్ లో కలిసి ఉండగా.. అతడి మూడో భార్య రచ్చ చేయడం తెలిసిందే. నరేష్ మూడో భార్య ఏకంగా చెప్పుతో కొట్టినంత పని చేయడంతో వార్తల్లో నిలిచింది.

 

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణించినప్పుడు కూడా నరేష్ చేసిన అతి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అంత్యక్రియల టైంలో నరేష్ మేకప్ వేసుకొని రావడం, కూలింగ్ గ్లాసులు పెట్టుకొని పోజులివ్వడం, పవిత్రా లోకేష్ తో సైగలు చేయడం లాంటివి అందరికీ ఇబ్బంది కలిగించాయి. అయితే వీటన్నింటిని పట్టించుకోని నరేష్.. కొత్త ఏడాది సందర్భంగా విడుదల చేసిన ఓ వీడియో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

 

త్వరలోనే ఒక్కటి కాబోతున్నాం అన్నట్లు నరేష్, పవిత్రా లోకేష్ లు ఏకంగా లిప్ కిస్ పెట్టుకొని కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలపడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అయితే తాజాగా నరేష్ మొదటి భార్య చనిపోవడానికి గల కారణం గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. టాలీవుడ్ కు చెందిన కొరియెగ్రాఫర్ శ్రీనివాస్ కుమార్తెతో నరేష్ మొదటి పెళ్లి కాగా.. ప్రారంభంలో వీరి జీవితం బాగా సాగిందట. దీంతో వీరికి నవీన్ కృష్ణ పుట్టాడట.

 

అయితే కొన్నాళ్ల తర్వాత నటుడు నరేష్ రేఖ సుప్రియతో ప్రేమాయణం నడిపించడం తన మొదటి భార్యను తెలిసిందట. దీంతో ఆమె గొడవకు దిగగా.. ఈ గొడవలు పెద్దవై, చివరకు ఇద్దరు విడిపోయే వరకు వెళ్లిందట. తర్వాత వీరిద్దరు కోర్టు ద్వారా విడిపోగా.. నరేష్ తన కొడుకు కోసం కోర్టుకు వెళ్లగా, కోర్టు కూడా నరేష్ వద్దే కొడుకు ఉండాలని తీర్పునిచ్చిందట. ఇలా తన భర్తకు దూరమై, కొడుకుకు దూరమైన నరేష్ మొదటి భార్య డిప్రెషన్ లోకి వెళ్లిందట. చాలాకాలం పాటు డిప్రెషన్ తో బాధపడిన ఆమె చివరకు చనిపోయిందట. ఇలా నరేష్ వల్లే ఆమె చనిపోయిందని ఇండస్ట్రీలో అప్పట్లో గుసగుసలు వినిపించాయి.

Related Articles

ట్రేండింగ్

Chamundeshwari Stotram: ఈ స్తోత్రం చదివితే కష్టాలు కచ్చితంగా తీరతాయి.. దేవి అనుగ్రహంతో?

Chamundeshwari Stotram: కష్టం వస్తే దేవుని వైపు చూడడం మానవుని సహజలక్షణం. అందులోని అమ్మవారి స్తోత్రాలు మరింత శ్రేష్టమైనది. అందులోనే చాముండేశ్వరి మంగళ స్తోత్రం కూడా ఒకటి. ఈ స్తోత్రం చదివితే కష్టాలు...
- Advertisement -
- Advertisement -