Akhil Akkineni: అఖిల్ నటించిన సినిమాలు డిజాస్టర్లు కావడానికి రీజన్ ఇదేనా?

Akhil Akkineni: అక్కినేని వారసుడు అఖిల్ కు సినిమాలు అంతగా కలిసి రావడం లేదు. ఎప్పుడో చిన్నప్పుడు సిసింద్రీ సినిమాతో బాలనటుడుగా అడుగుపెట్టిన అఖిల్ తర్వాత కొంతకాలానికి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. అలా తన పేరుతోనే ఒక సినిమాను చేశాడు. కానీ మొదటి సినిమా నిరాశపరిచింది. ఆ తర్వాత మరో రెండు మూడు సినిమాల్లో చేయగా ఆ సినిమాలు కూడా పూర్తిగా డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఆ సమయంలోనే అక్కినేని అఖిల్ కు సినిమాలు కలిసి రావని చాలామంది అనుకున్నారు.

కానీ మళ్లీ ఏజెంట్ సినిమాతో ప్రేక్షకులలో ఆశ పుట్టించాడు అఖిల్. పైగా ఈ సినిమాకు భారీ ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ ఈ సినిమా మొదటి రోజే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో అఖిల్ ఆశలన్నీ నిరాశలు అయ్యాయి. అయితే అఖిల్ కు ఇలా కలిసి రాకపోవటానికి కారణం ఒక దోషం ఉందని తెలుస్తుంది. ఆ విషయాన్ని బయట పెట్టింది ఎవరో కాదు వేణు స్వామి.

 

వేణు స్వామి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఎంతో మంది సెలబ్రెటీల జాతకాలు చెప్పి నిజం చేశాడు. అయితే అఖిల్ విషయంలో కూడా కొన్ని సంచలన కామెంట్లు చేశాడు. అదేంటంటే ఆయనకు హిట్ పడాలంటే ఒకటే మార్గం ఉందని.. ముఖ్యంగా ఆయనకు నాగ దోషం ఉందని.. ఆ దోషం వల్ల పక్క వాళ్ళ సలహాలు అతనికి పనిచేయవు అని అన్నాడు.

అంతేకాకుండా అఖిల్ జాతక ప్రకారం చంద్రుడు నీచంలో ఉన్నాడంటూ.. తల్లి చంద్రుడికి, తండ్రి సూర్యుడికి సంకేతం అని.. దీంతో అఖిల్ అమలకు దూరంగా ఉండాలి అని.. ఆమె చెప్పే సలహాలు ఏవి తీసుకోకూడదు అని అన్నాడు. ముఖ్యంగా అఖిల్ పై అమల ప్రమేయం కలిసి రాదు అని.. ఆయన మంచి హిట్ కొట్టాలంటే సొంత తెలివితేటలతో సినిమాను ఓకే చేసుకోవాల్సింది అని.. అంతేకాకుండా నాగదోషానికి నివారణ చేసుకోవాలి అని అన్నాడు. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -