Rajamouli: రాజమౌళి ప్రతి మూవీలో శేఖర్ ఉండటానికి రీజన్ ఇదేనా?

Rajamouli: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడుగా దూసుకుపోతున్నారు రాజమౌళి. దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏడాది విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరిన్ని దేశాలకు చాటిచెప్పారు రాజమౌళి. అంతే కాకుండా ఈ సినిమాకు గాను ఆస్కార్ అవార్డుని సైతం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

దాంతో రాజమౌళి గురించి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్స్ చాలామంది రాజమౌళి సినిమాలో చిన్న పాత్రలో నటించినా చాలు అని అనుకుంటున్నారు. అసలు విషయంలోకి వెళితే. రాజమౌళి ప్రతి సినిమాలో కొందరు నటీనటులు ఖచ్చితంగా ఉంటారని చెప్పవచ్చు. కాగా రాజమౌళి ఇప్పటివరకు రూపొందించిన సినిమాలలో కనిపించిన నటులలో చత్రిపతి శేఖర్ ఒకరు. రాజమౌళి రూపొందించిన శాంతి నివాసం సీరియల్ నుంచి మొన్న వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా వరకు ప్రతి సినిమాలో చత్రపతి శేఖర్ కనిపించారు.

కాగా రాజమౌళి ఇప్పటివరకు దాదాపుగా 12 సినిమాలు తెరకెక్కించగా 12 బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. రాజమౌళి 12 సినిమాలు తెరకెక్కించగా అందులో 9 సినిమాలలో కూడా చత్రపతి శేఖర్ నటించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటంచిన చత్రపతి సినిమాలో హీరో స్నేహితుడిగా కనిపించి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ఈ మూవీ నుంచి అతని పేరు చత్రపతి శేఖర్‏గా మారిపోయింది. అయితే రాజమౌళి సినిమాలలో శేఖర్ కనిపించడానికి ఓ కారణం ఉందట. అదేంటంటే.. రాజమౌళి దర్శకత్వం వహించిన శాంతి నివాసం సీరియల్ సమయంలోనే శేఖర్‏తో పరిచయం ఉందట. కానీ శేఖర్ ఎప్పుడూ జక్కన్నను అవకాశాలు ఇవ్వాలని అడగలేదట. కానీ నటుడిగా తనకు సపోర్ట్ చేయాలనే ఉద్ధేశంతో రాజమౌళి తన సినిమాల్లో అవకాశాలు ఇస్తూ ఉంటారని చెప్పుకొచ్చారు శేఖర్. సినిమా స్టార్ట్ చేశాక జక్కన్న పిలుస్తాడని అప్పటివరకు సినిమా ఏంటీ తన పాత్ర ఏంటనేది తనకు తెలియదని అన్నారు.

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -