YS Vijayamma: పంపకాల పంచాయితీలో విజయమ్మ రూట్ ఇదేనా.. ఏం జరిగిందంటే?

YS Vijayamma: వైఎస్ షర్మిల ఒక సభలో ప్రసంగిస్తూ సాక్షి దినపత్రికలో తనకు సగం వాటా ఉందని, జగన్ కు ఎంత వాటా ఉందో తనకు అంతే వాటా ఉంటుందని ఆమె చెప్పారు. తనపై దిగజారి విమర్శలు చేస్తున్నారని, వారి విమర్శలకు తాను భయపడి పారిపోనని ఆమె అన్నారు. చనిపోయిన వ్యక్తిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు అంటూ తన అన్న పై నిప్పులు కక్కారు.

 

అయితే ఉన్నట్టుండి షర్మిల ఆస్తుల వాటాల గురించి మాట్లాడే సరికి ఇప్పుడు సాక్షి మీడియా ఆస్తి విలువలపై అందరి దృష్టిపడింది. అసలు సాక్షి మీడియాలో ఎవరికి ఎంత వాటాలు ఉన్నాయి అనే చర్చ కొత్తగా తెరమీదకి వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెట్టిన మీడియా సంస్థ సాక్షి. అప్పట్లో వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సంస్థని కుమారుడితో పెట్టించారు. అప్పుడు కుమారుడు హైలెట్ అయ్యాడు తప్పితే షర్మిల జాడ ఎక్కడ కనిపించలేదు.

అయితే కచ్చితంగా ఆస్తిలో వాటాలు ఉండి ఉంటాయి. అయితే ఎవరికి ఎంత అనేది తేలాలంటే అందుకు ప్రత్యక్ష సాక్షి అయిన తల్లి వైఎస్ విజయమ్మ నోరు విప్పాలి. మరి ఆమె గుట్టు విప్పుతారా అనేది సందేహించాల్సిన విషయం. ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఆత్మ మిత్రుడు, అంతరాత్మగా చెప్పబడే కెవిపి రామచంద్ర రావు కి ఈ విషయాలు తెలిసే ఉంటాయి. ఎందుకంటే ఈయనే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి కి సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకునేవారు. ఇప్పుడు ఈయన కూడా పెదవి విప్పే సమయం ఆసన్నమైంది.

 

ఇప్పుడు జగన్ తన వైసీపీకి సంబంధించిన వార్తా సమాచారం అంతా సాక్షి మీడియాలో ప్రసారం చేసేలాగా చూస్తున్నారు ఇప్పుడు షర్మిల తనకి కూడా వాటా ఉంది అనటంతో తను కాంగ్రెస్ కు సంబంధించిన సమాచారం ప్రసారం చేయించినట్లయితే అప్పుడు సమస్య మొదలవుతుంది. రాబోయే రోజుల్లో సాక్షి మీడియా కుటుంబ కలహాలతో రెండుగా చీలిపోతుంది ఏమో అనే భయం ఈ సంస్థలో పనిచేసే వాళ్ళకి మొదలైంది.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -