RGV: ఆర్జీవీ పవన్ ఫ్యాన్స్ ను అందుకే కెలుకుతాడా.. ఏమైందంటే?

RGV: టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు రామ్ గోపాల్ వర్మ. నిత్యం ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిపై విమర్శలు గుప్పిస్తూ లేనిపోనీ కాంట్రవర్సిలను కొనితెచ్చుకుంటూ ఉంటారు వర్మ. సమాజంలో జరిగే విషయాలపై, రాజకీయ విషయాలపై, సినిమాల విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా వర్మ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ మీద పవన్ ఫ్యాన్స్ తో ఆడుకోవడం, వాళ్లను కెలకడం అంటే తనకెంతో ఇష్టమని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు.

నిజానికి వాళ్లు నేను ఏం ట్వీట్ చేసాను అన్నది కూడా చూడరు, చదవరు కానీ అవేవీ చేయకుండానే నన్ను తిట్టడం మొదలెట్టేస్తారు అని తెలిపారు వర్మ. నేను రాసే ఇంగ్లీష్ కానీ, కాంప్లికేటెట్ ఫ్రేజ్ లు, సెంటెన్స్ లు కానీ వారికి అర్థం కావు అని తెలిపారు వర్మ. నేను కూడా కావాలనే అలా రాస్తాను. నిజానికి పవన్ కళ్యాణ్ అంటే నాకు ఏ ద్వేషం లేదు, నేను ఏ రోజు ఆయనను విమర్శించలేదు అని చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. సెటైర్స్ అయితే వేశాను కానీ ఎప్పుడు విమర్శించలేదు అని తెలిపారు. చంద్రబాబు అంటే తనకు నచ్చదని, ఎన్టీఆర్ కు వెన్నుపోటు ఉదంతంలో తనకు ఆయన అంటే ఒక నెగిటివిటీ స్థిరపడిపోయిందని, అది ఎప్పటికి పోదని తెలిపారు.

చంద్రబాబు హైదరాబాద్ ను షాంగై చేసేస్తా అంటూ చెప్పే మాటలకు నచ్చవు. వైఎస్సార్ మరణించిన తరుువాత జగన్ ను తొలిసారి చూసానని, అతని మాట తీరు, బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతీదీ నాకు బాగా నచ్చాయి. జగన్ ఎలా పాలన సాగిస్తున్నారు, అది బాగా వుందా లేదా నాకు తెలియదు. అనవసరం అని చెప్పుకొచ్చారు వర్మ. వ్యూహం సినిమాలో పాజిటివ్, నెగిటివ్ రెండూ వుంటాయి. అయితే సినిమా జగన్ కు అనుకూలంగానే ఉంటుంది. వ్యూహం సినిమాకు నిర్మాత దాసరి కిరణ్ అని, ఆయన వెనుక ఎవరన్నా వున్నా, ఎవరన్నా ఫండింగ్ ఇస్తున్నారా అన్నది తెలియదు, అనవసరమని అని చెప్పుకొచ్చారు రాంగోపాల్ వర్మ. నేను రూపొందిస్తున్న వ్యూహం సినిమాలో జగన్ పాత్ర వుంది కనుక, ఆయన గురించి తెలుసుకోవడానికి మాత్రమే జగన్ ని కలిసాను అని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -