Janasena: జనసేన గెలుపు కోసం వైసీపీ ఇంతలా కష్టపడుతోందా.. ఏమైందంటే?

Janasena: ఎన్నికల్లో విజయం సాధించడానికి రాజకీయ పార్టీలు వందల వ్యూహాలు రచిస్తాయి. అయితే.. ఆ వ్యూహాలు తమకు ఎలా ఓట్లు పడాలి అనే విధంగా ఉంటే పర్వాలేదు. కానీ, వైసీపీ వ్యూహాలు అన్నీ.. టీడీపీ, జనసేన పొత్తును ఎలా చెడగొట్టాలా అనే విధంగానే ఉంటుంది. పవన్ పావలా స్టార్, చంద్రబాబుకు వయస్సు అయిపోయింది. లోకేష్ కు తెలుగురాదు అంటూ చెబుతున్న వైసీపీ ఆ పొత్తును ఎందుకు లైట్ తీసుకోలేకపోతోంది అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎందుకుంటే.. ప్రత్యర్థులను ప్రజల నమ్మరు అనుకునేటప్పుడు దైర్యంగా వైసీపీ తన పని తాను చేసుకోవచ్చు కదా? చంద్రబాబు, పవన్ పొత్తుగురించి ఎందుకు మాట్లాడటం? సింహం సింగిల్‌గా వస్తుందని చెబుతున్న వైసీపీ నేతలు.. ప్రత్యర్థులు ఎలా వస్తే మాకెందుకు అనేలా ఎందుకు ఉండలేకపోతున్నారు. ఎప్పుడు చూడు టీడీపీ, జనసేన పొత్తు ఉండకుండా ఢిల్లీ నుంచి లాబీయింగ్ చేశారు.

 

 

 

ఈ ఇద్దరిని విడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. అవి కుదరకపోవడంతో.. కాపు నేత హరిరామజోగయ్యను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా అని ఆయన వైసీపీకి మద్దతిస్తారా అంటే అది కూడా లేదు. కేవలం హరిరామజోగయ్య జనసేనకు చేసిన సూచనలను వైసీపీకి అనుకూలంగా మార్చుకొని ప్రచారం చేస్తున్నారు. గత కొంతకాలంగా హరిరామజోగయ్య కాపుల ఉద్దరణ కోసం తనదైన సూచనలు చేస్తున్నారు. రాజ్యాధికారం కాపులకు దక్కాలనేది జోగయ్య ప్రయత్నం. అయితే.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆయన ఇటీవలకాలంలో ఈ ప్రయత్నాలు మొదలు పెట్టారు. బహుశా పవన్ రూపంలో కాపులకు రాజ్యాధికారం దక్కుతుందనే నమ్మకం కావొచ్చు. అందుకే.. అడగకపోయినా.. జనసేనకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. టీడీపీతో పొత్తులో జనసేనకు గౌరవప్రధమైన సీట్లు దక్కాలని.. మంత్రి పదవుల విషయంలో న్యాయం జరగాలని, ఇంకా చెప్పాలంటే పవన్ సీఎం కావాలనేది ఆయన ఆకాంక్షలా కనిపిస్తోంది. అలా కాపులకు రాజ్యాధికారం దక్కితే చూడాలని జోగయ్య ఆరాటం. ఈ ఆరాటాన్నే వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది.

రెండు రోజుల క్రితం హరిరామజోగయ్య ఓ బహిరంగ లేఖ రాశారు. దాన్ని వైసీపీ ఇష్టమొచ్చినట్టు రాసుకొని నచ్చినట్టు ప్రచారం చేస్తోంది. జోగయ్య తన లేఖలో పవన్ కల్యాణ్ తీరును విమర్శిస్తూ రాశారని.. వైసీపీ ఓటమి అంటే.. టీడీపీ గెలుపు కాదని.. జనసేన గెలుపుగా మారాలని సూచించినట్టు రాశారు. కనీసం 50 సీట్లు, రెండున్నరేళ్ల సీఎం పదవిని జనసేన దక్కించుకునే విధంగా సూచనలు చేసినట్టు వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు.. చంద్రబాబు జిత్తుమారి అని, చంద్రబాబు ప్యాకేజీకి పవన్ కాపులను అమ్మేస్తున్నాడని జోగయ్య అనుకుంటున్నట్టు కూడా వైసీపీ రాసుకొచ్చింది.

 

హరిరామజోగయ్య రాసిన విషయానికి వైసీపీ తన సొంత అభిప్రాయాలను జోడించి జనసేను బద్నాం చేయడం కొత్తేమీ కాదు. హరిరామజోగయ్య పేరు గతంలో ఫేక్ లెటర్లు కూడా రిలీజ్ చేశారు. దీనిపై ఆ పెద్దాయన కూడా గట్టిగా రియాక్ట్ అయ్యారు. ఇవ్వనీ వదిలేసి.. చంద్రబాబు కోణం పవన్ కు చేసిన సూచనలను మాత్రమే వైసీపీ అనుకూలంగా మార్చుకొని ప్రచారం చేస్తోంది. రెండు రోజుల క్రితం రాసిన లేఖలో కూడా పెద్దాయన టీడీపీతో పాటు, వైసీపీని కూడా విమర్శించారు. ఇంకా రాజ్యాధికారం రెడ్లు, కమ్మల దగ్గరే ఎన్నాళ్లు అని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వరా అని వైసీపీని సైతం ఏకిపారేశారు. ఇవన్నీ మర్చిపోయి.. జోగయ్య ఇచ్చిన సలహాలు చాలవని వాటికి వక్రీకరించి వైసీపీ జనసేనకు సలహాదారులను నియమించినట్టు తయారైంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -