YS Sunitha: వైఎస్ సునీత తెలుగుదేశంలో చేరనున్నారా.. ఇదే సాక్ష్యమంటూ?

YS Sunitha: ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మళ్ళీ చర్చ ప్రారంభమైంది. ప్రస్తుత రాజకీయాలన్నీ ఆ హత్య కేసు చుట్టూనే తిరుగుతున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత.. తండ్రి చావుకి కారణమైన వాళ్ళని శిక్షించాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు.

అందుకే ఈ కేసుని సుప్రీంకోర్టు వరకు తీసుకువెళ్లారు సునీత. ఈ హత్య కేసులో.. నిందితులు కుటుంబ సభ్యులే కావటం గమనార్హం అయినా వెనకడుగు వేయడం లేదు సునీత. ఈ మధ్యనే నిందితుడు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ మరోసారి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు సునీత.

 

సుప్రీం కోర్టు అవినాష్ రెడ్డి అరెస్ట్ కి సీబీఐ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. అదే జరిగితే తొందరలోనే అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లే సూచనలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే విషయం ఏమిటంటే తాజాగా ప్రొద్దుటూరులో వైఎస్ సునీత పేరుతో రాత్రికి రాత్రే పొలిటికల్ ఎంట్రీ ఫ్లెక్సీలు వెలిశాయి.

 

ఈ ఫ్లెక్సీలలో సునీతతో పాటు చంద్రబాబు నాయుడు, అచ్చెం నాయుడు, కడప జిల్లా టీడీపీ నేత బీటెక్ రవి తదితరులు ఉండడం గమనార్హం. రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న సునీతమ్మ గారికి స్వాగతం అంటూ ఫ్లెక్సీలో రాసి ఉండటం ప్రొద్దుటూరులో పొలిటికల్ హీట్ ని రగిల్చింది. అయితే ఈ ఫ్లెక్సీలు అతికించింది ఎవరు అనే విషయం తెలియ రాలేదు.

 

నిజంగానే వైఎస్ సునీత పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా.. లేకపోతే ఇదంతా ఫేక్ న్యూసా అనేది తెలియాల్సి ఉంది. ఈ వార్త అవినాష్ రెడ్డి లో అరెస్టు భయం పెంచిందని చెప్పాలి. అప్పుడే ఈయన హైదరాబాద్ నుంచి పులివెందులకు వెళ్లి అక్కడ ప్రజా దర్బారు నిర్వహించడానికి కూడా సిద్ధమయ్యారు.

 

సునీత తెలుగుదేశం పార్టీలో చేరటం వైఎస్సార్ సీపీ నేతలకు మింగుడు పడటం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి చావుని వాడుకుంటుందంటూ దుయ్యబడుతున్నారు

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -