Pawan Vs Volunteers: 2024లో వాలంటీర్ల ఓట్లు పవన్ కు పడే అవకాశం లేదా?

Pawan Vs Volunteers: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రలో భాగంగా ఏలూరు సభలో మాట్లాడుతు రాష్ట్రంలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని అందుకు వాలంటీర్లే కారణమని ఆరోపణలు చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా వాలంటీర్లు రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నాలు చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు.

ఇక పలు ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో వాలంటీర్ల పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పాలి ఇలాంటి వాలంటీర్లను పట్టుకొని పవన్ కళ్యాణ్ అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సబబు కాదంటూ వైసీపీ నేతలు కూడా తిప్పి కొడుతున్నారు అలాగే ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు సరైన ఆధారాలు ఉంచుకొని వ్యాఖ్యలు చేయాలని లేకపోతే పవన్ చేసిన మాటలన్నీ గాలి మాటలే అంటూ పలువురు కొట్టి పారేస్తున్నారు.

 

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మధ్య పెద్ద ఎత్తున వార్ నడుస్తోంది పవన్ కళ్యాణ్ ఎక్కడైతే తమ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారో అదే ప్రాంతంలో తమ గురించి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే ఈ విషయంపై పలువురు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు వాలంటీర్లను టార్గెట్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ కు పెద్దగా ఒరిగేది ఏమీ లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా అందరిని దగ్గర చేసుకోవాల్సింది పోయి వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వ్యతిరేకత ఏర్పరచుకుంటున్నారు ఇక వాలంటీర్లుగా ఉన్నటువంటి వారిలో వైఎస్ఆర్సిపి పార్టీ వారు మాత్రమే కాదని పవన్ కళ్యాణ్ అభిమానులు కాపులు కూడా ఉన్నారన్న విషయాన్ని పవన్ గుర్తించలేకపోయారని తెలిపారు. ఇలా వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వచ్చే ఎన్నికలలో ఈయనకు కాస్త ఇబ్బందికరంగా మారుతుందని పలువురు ఈ విషయంపై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -