Vasireddy Padma: ప్రేమలకు సినిమాలు కారణం కాదా పవన్.. వాసిరెడ్డి పద్మ ఏమన్నారంటే?

Vasireddy Padma: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలోని వాలంటీర్ వ్యవస్థ పై తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి మహిళల డేటాను తీసుకోవడం వల్లే వారు అదృశ్యం అవుతున్నారని ఇప్పటివరకు ఏపీలో దాదాపు 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని తెలిపారు.ఇలా మహిళలు అదృష్టం కావడానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఏపీ డీసీపీ అలాగే మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మజ సమాధానం చెప్పాలి అంటూ ఈయన డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ విషయంపై వాసిరెడ్డి పద్మజ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసలు ఇలా మహిళలు మిస్ అవ్వడానికి కారణం సినిమాలేనని తెలిపారు. సినిమాలలో చూపిస్తున్నటువంటి ప్రేమకు ఆకర్షితులవుతున్నటువంటి యువతులు కూడా ప్రేమ పేరుతో అదృశ్యమవుతున్నారని తెలిపారు. అయితే మిస్సింగ్ కేసులలో భాగంగా దేశవ్యాప్తంగా ఏపీ 11వ స్థానంలో ఉందని ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రస్తావించడం లేదని ఈమె ప్రశ్నించారు.

 

ఇక 30 వేల మంది మహిళలు అదృశమయ్యారు అయితే వారిలో 70% మహిళలను గుర్తించే వెనక్కి తీసుకొచ్చామని పద్మజ తెలిపారు.ఇక ఆ విషయం గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు అంతేకాకుండా రికవరీలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉందని కూడా ఈమె ఈ సందర్భంగా తెలిపారు.ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ఆయన కనుక కనపడితే లాగిపెట్టి ఒకటి కొట్టాలని ఉంది అంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.

 

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకొని మహిళలకు అన్యాయం చేస్తున్నారు .భరణం ఇచ్చినప్పటికీ ఆ మహిళలకు అన్యాయం చేసినట్టు కాదా అంటూ ఈమె ప్రశ్నించారు. అయితే ఇలా అన్ని రాష్ట్రాలలోనూ మహిళలు మిస్ అవ్వడానికి కారణం సినిమాలేనని సినిమాలు చూసే యువత కూడా చెడిపోతున్నారు అంటూ ఈ సందర్భంగా ఈమె మాట్లాడారు. ఇక మహిళలు అపహరణ జాబితాలో తెలంగాణ ఆరో స్థానంలో ఉంది మరి పవన్ కళ్యాణ్ అక్కడ ఎందుకు ప్రశ్నించడం లేదని ఈమె పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -