Karnataka Elections: కర్ణాటక ఎన్నికల్లో జగన్ అందుకే జోక్యం చేసుకోవడం లేదా?

Karnataka Elections: 2018లో జరిగిన కర్ణాటక ఎన్నికలలో తెలుగు పార్టీలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. మరి ముఖ్యంగా ఏపీ రాజకీయ పార్టీలు చేసిన హడావిడి గురించి మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో అప్పటికే బీజేపీతో కటీఫ్ చెప్పి యుద్ధం ప్రకటించిన టీడీపీ కూడా కర్ణాటకలో తెలుగు ఓటర్లను ప్రభావితం చేయడం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో వైసీపీ నేతలు కొందరు బిజెపికి మద్దతుగా ప్రచారాలు కూడా చేసిన సంగతి తెలిసిందే. అలా ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య ఉన్న వార్ కాస్త కర్ణాటక వరకు వెళ్ళింది.

కానీ వచ్చే ఏడాది జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో జోకింగ్ చేసుకోవడానికి జగన్,బాబు ఇద్దరూ వెనకడుగు వేస్తున్నారు. నామినేషన్ల ఘట్టం పూర్తయినా ఒక్కరు కూడా ఆ రాష్ట్ర ఎన్నికల గురించి కనీస ప్రకటన చేయలేదు. నిజానికి కర్ణాటకలో తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువే ఉంటుంది. కర్ణాటకలో తెలుగు రాష్ట్రాల నుంచి వలస వెళ్లి స్థిరపడిన వారు కాకుండా తరతరాలుగా కర్ణాటక స్థిరపడిన తెలుగు మూలాలు ఉన్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వారి ఓట్లు గెలుపు ఓటమి లను నిర్దేశించబోతున్నాయి.

 

అందుకే అన్ని రాజకీయ పార్టీలు తెలుగు ఓటర్లపై పక్రత్యేక దృష్టి పెట్టాయి. తెలుగు రాష్ట్రాల నుంచి నేతల్ని ప్రచారానికి పిలవడంతో పాటు సామాజికవర్గ సమీకరణాల్ని చూసుకుంటూ నేతల ప్రచార షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. మెజార్టీకి అవసరమైన ఓట్లు తెలుగు ఓటర్లు ఇస్తారని నమ్మడంతో ఈ సారి అన్ని పార్టీలు తెలుగు ఓటర్లు పై ఎక్కువ దృష్టిని పెట్టాయి. బెంగళూరు నగరంతో పాటు హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో కూడా దాదాపుగా 60 నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు గెలుపు ఓటమి లను నిర్దేశించే పరిస్థితిలో ఉన్నారని చెప్పవచ్చు. తెలుగు ఓటర్లు అందరూ ఎటువైపు నిలబడితే అటువైపు విజయం ఉంటుందన్న ప్రచారం కూడా సాగుతోంది. అయినా ఏపీ రాజకీయ నేతలు మాత్రం బీజేపీతో గెలుక్కోవడం ఎందుకని సైలెంట్ గా ఉంటున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -