Chiranjeevi: తమ్ముడికి చిరంజీవి జ్ఞానబోధ చేస్తే బెటర్.. రాజకీయాలు అంటే విమర్శలు మామూలేగా చిరు?

Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతూనే ఉన్నాయి. తాజాగా చిరుకి కొడాలి నాని, అంబటి రాంబాబు తదితర రాజకీయ నాయకులు చిరంజీవి కౌంటర్ కి స్ట్రాంగ్ రి కౌంట్ ఇచ్చారు. హీరోలందరూ జగన్ దగ్గరికి ఎందుకు వెళ్లారని.. ఏ హీరో కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని.. రాష్ట్రం విడిపోతున్నప్పుడు చిరంజీవి ఏం చేశారని రోజా చిరంజీవిని ఓ లెవెల్లో దుమ్ము దులిపేసింది.

మరోవైపు మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ సినిమాలను రాజకీయాల్లోకి తెచ్చింది ఎవరో చిరంజీవి చెప్పాలని ఈ ప్రశ్నించారు. ముందు తమ్ముడికి చెబితే బాగుంటుంది అని ఆయన పేర్కొన్నారు. మంత్రి రాంబాబు క్యారెక్టర్ సృష్టించింది ఎవరు అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఆ పాత్ర రాంబాబుది అని చెప్పే ధైర్యం కూడా లేదని మంత్రి దుయ్యబట్టారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకి అంబటి రాంబాబు కూడా తీవ్రంగా విమర్శించారు.

 

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ్ముడు తన వాడు అయినా ధర్మం చెప్పాలి అన్నయ్యగారు అంటూ సెటైర్లు వేశారు. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పెట్టారో లేదో చిరంజీవి చెప్పాలని రాంబాబు డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని మరో అడుగు ముందుకు వేసి సినీ పరిశ్రమలో చాలామంది పకోడీగాళ్లు ఉన్నారు. ప్రభుత్వం ఎలా ఉండాలో ఆ పకోడీలు కూడా సలహాలు ఇస్తున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు వేశారు. మాకు సలహా ఇచ్చే బదులు వాళ్ళ వాళ్లకు సలహాలిస్తే బాగుంటుంది.

 

మనకెందుకురా బాబు రాజకీయాలు మన డాన్స్లో, మన ఫైట్లు మనం చేసుకుందామని వాళ్ళకి కూడా సలహా ఇస్తే మంచిది అంటూ నాని చురకలాంటించారు. అయితే చిరు ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యలు అటు సినీ పరిశ్రమలోనూ ఇటు రాజకీయ వర్గాల్లో కూడా తీవ్రతుమారాన్ని రేపాయి. కొసమెరుపు ఏమిటంటే సినిమాల్లోనుంచి రాజకీయాల్లోకి వెళ్లిన నటి రోజా సినిమా వాళ్ళు చెప్తే వినే పరిస్థితుల్లో మేము లేము అంటూ స్టేట్మెంటు ఇవ్వడం హాస్యాస్పదంగా మారింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -