Jabardast: నడవలేని స్థితిలో పంచ్ ప్రసాద్.. ఆ సమస్య వల్లేనా?

Jabardast: తెలుగులో బాగా పాపులర్ అయిన టీవీ షోల్లో జబర్దస్త్ ఒకటి. ఈ షోలో చేసే చాలామంది కమెడియన్లకు బయట కూడా ఎంతో గుర్తింపు ఉంది. జబర్దస్త్ కమెడియన్లు చాలా ఈవెంట్లు, కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. ఈక్రమంలో ఈటీవీలో వచ్చే దాదాపు అన్ని ఈవెంట్లలో తనదైన పంచులతో అందరినీ నవ్వించే పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

 

ఎవరు ఏ డైలాగ్ చెప్పినా.. వారికి ఏదో ఒక రూపంలో కౌంటర్ వేస్తూ అందరినీ నవ్వించే పంచ్ ప్రసాద్ జీవితంలో దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నాడు. జబర్దస్త్ తో పాటు పలు కార్యక్రమాల్లో పంచులు వేసే పంచ్ ప్రసాద్.. ఆరోగ్య పరిస్థితి దారుణంగా మారింది. కనీసం తనకు తానుగా నిలబడి, పనులు చేసుకునే పరిస్థితిలో కూడా పంచ్ ప్రసాద్ లేడు.

 

తాజాగా నూకరాజు, ఆసియాతో కలిసి పంచ్ ప్రసాద్ ఇంటికి వెళ్లి.. ఆరోగ్య స్థితి గురించి ఆరా తీశారు. పంచ్ ప్రసాద్ కు తెలియకుండా తీసిన వీడియోలో.. ప్రసాద్ కనీసం లేచి కూర్చునే పరిస్థితి కనిపించలేదు. రెండు కిడ్నీలు పాడైపోయిన స్థితిలో ఉన్న పంచ్ ప్రసాద్.. కనీసం నిలబడలేని స్థితిలో ఉన్నాడు.

 

పంచ్ ప్రసాద్ భార్య మాట్లలో.. ‘ఓరోజు షూటింగ్ తర్వాత ఫీవర్‌గా ఉందని ఇంటికొచ్చిన ప్రసాద్.. నడుము నొప్పితో చాలా బాధపడ్డాడు. అలా నడవలేక చాలా ఇబ్బందిపడ్డారు. డాక్టర్స్ కూడా ఫస్ట్ ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదని, టెస్టులు చేస్తే నడుము వెనక వైపు కుడికాలి వరకు చీము పట్టేసినట్లు తెలిసింది’ అని వివరించింది.

 

అయితే సహాయం కోసం ఎవరినైనా అడుగుదామని పంచ్ ప్రసాద్ భార్య పలుసార్లు చెప్పినా కానీ ఆయన మాత్రం వాటిని పట్టించుకోకుండా, నిరాకరించినట్లు తెలుస్తోంది. కాగా పంచ్ ప్రసాద్ ఇక జీవితంలో లేచి నిలడగలుగుతాడా అనే ప్రశ్న తలెత్తుతోంది. అందరినీ నవ్వించే పంచ్ ప్రసాద్.. దయనీయ స్థితిలో ఉన్నందున ఎవరైనా అతడికి సాయం చేయాలని, అతడిని తిరిగి స్టేజ్ మీద పంచులు వేస్తే చూడాలని ఉందంటూ అభిమానులు కోరుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -