YS Jagan : ఎన్నికల కోసం చంద్రబాబు వ్యూహన్ని అమలు చేస్తున్న జగన్

YS Jagan : వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్ ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పొలిటికల్ హీట్ ను ఇప్పుడే పెంచేస్తున్నారు. కుప్పంపై టార్గెట్ చేయడంతో పాటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. జగన్ కుప్పం పర్యటనతో ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. కుప్పంలో పర్యటించిన సీఎం జగన్.. వైఎస్సార్ చేయూత పథకం మూడో విడత నగదను విడుదల చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాుడుతూ.. చంద్రబాబు టార్గెట్ గా విమర్శల దాడి చేశారు. కుప్పంలో చంద్రబాబుకు రోజులు పడ్డాయంటూ వ్యాఖ్యానించారు.

అయతే ఈ సందర్భంగా జగన్ వరాలు ప్రకటించారు. జనవరి నుంచి ఫించన్ పెంచుతన్నట్లు ప్రకటించారు. 2,500గా ఉన్న ఫించన్ ను రూ.2,750కి పెంచుతన్నట్లు తెలిపారు. కుప్పంలో జరిగిన సభలో మహిళల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించే మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వివరాలన్ని తెలియజేశారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఎంత నిధులను విడుదల చేశామనే వివరాలను జగన్ లెక్కలతో సహా బయటపెట్టారు. తమది మహిళల ప్రభుత్వం అంటూ జగన్ వ్యాఖ్యానించారు.

అమ్మఒడి, వితంతువుల పింఛన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలో వైెస్సా్ చేయూత, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించి పథకాల గురించి తెలియజేశారు. అమ్మఒడి పథకం ద్వారా తమ పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. గత మూడేళ్లల్లో అమ్మఒడి పథకం ద్వారా రూ.లక్షా 17 వేల కోట్లు నేరుగా మహిళల అకౌంట్ లో జమ చేశామని తెలిపారు. 4 పథకాల ద్వారా మహిళలకు రూ.51 కోట్లు ఇచ్చామని జగన్ తెలిపారు. ఇక వైఎస్సార్ చేయత పథకం ద్వారా ఎస్సీ,ఎస్టీ, బీసీ మహిళలకు గత మూడేళ్లలో రూ.14110 కోట్లు అందించామని స్ పష్టం చఏశారు.

మహిళల కోసం గత మూడేళ్లలో ఎన్ని కార్యక్రమాలు చేపట్టామననారు. కుప్పం పర్యటలో కేవలం మహిళల ఓట్లే టార్గెట్ గా జగన్ మాట్లాడారు. దీంతో దీని వెనుక మహిళల ఓటర్లను ఆకట్టుకునే వ్యూహం ఉందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గత ఎన్నికలకు ముందు పసుపు-కుంకుమ పథకం ద్వారా మహిళలకు రూ.10 వేలు చంద్రబాబు సాయం చేశారు. ఇప్పుడు జగన్ కూడా ఎన్నికలకు ముందే మహిళా ఓటర్లను టార్గెట్ చేశారు. దీంతో ఎన్నికలకు ముందు చంద్రబాబు వ్యూహన్నే జగన్ అమలు చేస్తు్నారని, మహిళా ఓటర్లను టార్గెట్ చేశారనే అభిపరాయం వ్యక్తమవుతోంది.

రానున్న రోజుల్లో జగన్ కూడా మహిళల కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ ఇప్పటినుంచే మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసేుకున్నారని, అందుకే చంద్రబాబు తరహా వ్యూహన్నే అమలు చేస్తున్నారని చెబుతున్నారు. దాని కోసం వ్యూహత్మకంగా జగన్ అడుగులు వేస్తు్నారిన చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని వ్యూహలు రచించే అవకాశముందని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -