Chandrababu: జగన్ నిమ్మకు నీరెత్తనట్లు ఉన్నారు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

Chandrababu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీ వాలంటరీ వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇది కాస్త వివాదాస్పదంగా మారి కేసులు పెట్టుకోవడం వరకు కూడా వెళ్ళింది. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. పవన్ పై జగన్ సర్కార్ పరువు నష్టం కేసు పెట్టిన వ్యవహారం పై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. పవన్ పై పరువు నష్టం కేసు పెట్టడం బుద్ధిమాలిన చర్య అని, నీతిమాలిన పని అని చంద్రబాబు దుయ్యబట్టారు.

ప్రజలు ప్రశ్నిస్తే దాడులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు అన్న రీతిలో జగన్ రాక్షస పాలన కొనసాగుతోంది అంటూ ఒక రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు. ప్రభుత్వం జవాబుదారీగా ఉండాల్సింది పోయి అణచివేత ధోరణికి దిగడం ఏంటంటూ ఆయన మండిపడ్డారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్లు సేకరిస్తున్నారని, దాన్ని ప్రశ్నించిన పవన్ పై కేసు ఎందుకు పెడుతున్నారని మండిపడ్డారు. ఆ సమాచారం సేకరించడమే ప్రభుత్వం చేస్తున్న తప్పు అని, దానిని దుర్వియోగం చేయడం నీచాతి నీచమని ఆగ్రహం వ్యక్తం చేశారు‌. ఒకవేళ కేసు పెట్టాల్సి వస్తే సీఎం జగన్ పైనే పెట్టాలని పవన్ పై కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ వ్యవస్థలను ఆయన దుర్వినియోగం చేసిన విధానంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

 

పరువు గురించి జగన్ మాట్లాడటం జోక్ అని, నాలుగేళ్ల దిక్కుమాలిన పాలనలో రాష్ట్ర పరువు, ప్రతిష్ట ఏనాడో మంట గలిసిపోయాయని నిప్పులు చెరిగారు. ప్రజల గొంతుకను అణిచివేయడమే లక్ష్యంగా, అరాచక ఆలోచనలు చేయడమే జగన్ పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రభుత్వానికి అప్పులు తెచ్చుకోవడంలో ఉన్న శ్రద్ధ రాష్ట్ర హక్కులు సాధించడంలో లేదని మండి పడ్డారు. విభజన చట్టం హామీల అమలు ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. పదేళ్ల రాష్ట్ర విభజన చట్ట కాలపరిమితి మరి కొద్ది నెలల్లో ముగుస్తున్నా జగన్ నిమ్మకు నీరెత్తినట్లున్నారని దుయ్యబట్టారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -