CM YS Jagan: మూడు రాజధానులపై జగన్ భారీ ప్లాన్.. టీడీపీని దెబ్బకొట్టేలా కీలక నిర్ణయం?

CM YS Jagan: ఏపీలో మూడు రాజధానుల అంశం ఎప్పటికీ హాట్ టాపిక్ గానే మారుతూ ఉంటుంది. రాజధాని అమరావతి రైతులు అమరావతి నుంచి విశాఖలోని అరసవెల్లికి పాదయాత్ర చేస్తుండటం, మూడు రాజధానులపై ఇటీవల అసెంబ్లీలో సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడంతో పాటు తాజాగా మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలో ఏపీ మూడు రాజధానుల అంశంపై వాడివేడిగా చర్చ నడుస్తోంది. అమరావతి రైతుల పాదయాత్రమే మంత్రులు హాట్ కామెంట్స్ చేయడం, పాదయాత్రను అడ్డుకుంటామని, తరిమికొడతామంటూ వైసీపీ నేతలు చేసిన కామెంట్లు రచ్చకెక్కాయి.

మూడు రాజధానులకే వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉండటంతో.. వచ్చే ఎన్నికల్లో ఇదే ఎజెండాతో, రిఫరెండంతో వైసీపీ ప్రజల్లోకి వెళ్లనుందని తెలుస్తోంది. మూడు రాజధానులకు మద్దతుగా కాకినాడ నుంచి ఇచ్చాపురం వరకు సభలు నిర్వహిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా గతంలో మూడు రాజధానుల బిల్లును తెచ్చినప్పుడు ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో సభలు నిర్వహించింది. మూడు రాజధానుల గురించి ప్రజలకు వివరించింది. కానీ హైకోర్టు మూడు రాజధానుల బిల్లు చెల్లదని కొట్టివేయడంతో మళ్లీ బిల్లు తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది.

ఇది ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో రాజధాని కీలక అంశం కాబోతున్న తరుణంలో సీఎం జగన్ ఇప్పటినుంచే దీనిపై ఫోకస్ పెట్టారు. మూడు రాజధానుల అంశంపై ప్రజల్లో సానుకూలత వచ్చే విధంగా ప్లాన్ లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని జగన్ సమాలోచనలు చేస్తున్నారు. ఈ మూడు ప్రాంతాల్లో మూడు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.

ఈ సభలకు సీఎం జగన్ స్వయంగా హాజరుకానున్నారు. రాయలసీమకు సంబంధించి కర్నూలులో, కోస్తాంధ్రకు సంబంధించి విజయవాడలో, ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నంలో భారీ బహిరంగస భలు నిర్వహించాలని భావిస్తున్నారు. జగన్ ప్రభుత్వం చెబుతున్న మూడు రాజధానుల ప్రాంతంలో భారీ బహిరంగ సభలు పెట్టి ఈ అంశాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. మూడు రాజధానుల వల్ల కలిగే లాభాలను ప్రజలకు చెప్పనున్నారు. దీని వల్లన అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వచ్చే ఎన్నికల్లో లాభపడవచ్చనేది జగన్ ప్లాన్ గా తెలుస్తోంది.

ఈ మూడు బహిరంగ సభలు విజయవంతమైతే ఎన్నికల నాటికి మరిన్ని ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేసి మూడు రాజధానులకు ప్రజల మద్దతను కూడగట్టనున్నారు. వైసీపీ మినహా మిగతతా పార్టీలన్నీ మూడు రాజధానులకు వ్యతిరేకిస్తున్నాయి. అమరావతినే రాజధానగా ఉంచాలని పోరాటం చేస్తున్నారు. అమరావతి రైతులకు పూర్తి మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ కూడా మద్దతు ఇవ్వకపోవడంతో మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వైసీపీ ప్రభుత్వానికి కష్టంగా మారింది. త్వరలోనే జగన్ విశాఖకు మకాం మారుస్తారని, మూడు రాజధానులకు ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు.

కానీ అసెంబ్లీలో ఎలాంటి బిల్లు ప్రవేశపెట్టకుండా జగన్ మకాం మార్చితే మళ్లీ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించే అవకాశముంటుంది. అందుకే ముందుగా మూడు రాజధానుల కోసం ప్రజల మద్దతును కూడగడితే వచ్చే ఎన్నికల్లో నష్టం ఉండదని భావిస్తు్న్నారు. రాజధాని అమరావతి అంటే కేవలం 25 గ్రామాల ప్రజలేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో అమారావతి రైతలు పాదయాత్ర వల్ల ఎలాంటి ఇబ్బందలు లేవని వైసీప ప్రభుత్వం భావిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -