Nara Lokesh: జగన్ ఆయుధం లోకేశ్ చేతిలోకి.. వాళ్ల నుంచి షాక్ తప్పదా?

Nara Lokesh: దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులకు ఎవరికీ రాని మూడు రాజధానుల ఆలోచన కేవలం జగనన్నకు మాత్రమే రావడం ఆంధ్ర ప్రజల అదృష్టమో లేకుంటే దురదృష్టమో అర్థం కావడం లేదు. కానీ అలా ఆలోచన రావడం వెనుక ఉన్న గొప్ప వ్యూహం మాత్రం టీడీపీ జనసేన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసింది అని తెలుస్తోంది. ఇందుకోసం ముందుగా అమరావతి మీద కమ్మ టీడీపీ బ్రాండింగ్ చేసి పక్కన పెట్టేశారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులందరి మీద కూడా కమ్మ, టీడీపీ ముద్ర వేసేసి అది టీడీపీ స్పాన్సర్డ్ ఆందోళనలని రాష్ట్ర ప్రజలకు నచ్చజెప్పాలని విశ్వప్రయత్నం చేశారు.

కానీ ప్రజలను మాత్రం నమ్మించలేకపోయారు. బహుశః ఆ ఉక్రోషంతోనే అరసవెల్లికి పాదయాత్రగా బయలుదేరిన రైతులపై వైసీపీ నేతలు తమ ప్రతాపం చూపించి ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధికారంలోకి రాగానే అమరావతిని పక్కన పడేసినందుకు, దానిపై ఎన్నో ఆశలు పెట్టుకొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పడం కోసం ఎదురుచూస్తే ఆశ్చర్యం లేదు. కనుక వచ్చే ఎన్నికలలో ఈ జిల్లాలలో అమరావతి అంశమే కీలకం కానున్నది. దానికీ వైసీపీ మూల్యం చెల్లించక తప్పకపోవచ్చు.

 

టీడీపీ, జనసేనల కోసం వైసీపీ ఏం స్కెచ్ వేసిందంటే, అటు రాయలసీమ లోను, ఇటు ఉత్తరాంద్ర జిల్లాల లోను మంత్రులు, ఎమ్మెల్యేల చేత ప్రాంతీయ ర్యాలీలు, రౌండ్ టేబిల్ సమావేశాలు, సభలు నిర్వహింపజేసి, ఆ రెండు ప్రాంతాలను అభివృద్ధి చేద్దామనుకొంటే టిడిపి, జనసేనలు సైంధవుడిలా అడ్డుపడుతున్నాయని నొక్కి చెప్పించారు. కనుక టిడిపి, జనసేనలను రాయలసీమ, ఉత్తరాంద్ర ప్రజలు తరిమి తరిమి కొట్టాలని హితోపదేశం చేశారు. ఇదే వైసీపీ మూడు రాజధానులు వెనుక ఉన్న స్కెచ్. ఇప్పుడు నారా లోకేష్‌ వైసీపీకి ఊహించని విదంగా మరో దెబ్బ కొట్టారు. మంగళవారం కర్నూలు పట్టణంలో పర్యటిస్తున్నప్పుడు, న్యాయవాదులు ఆయనను కలిసి కర్నూలు రాజధానిపై స్పష్టత ఇవ్వాలని కోరగా, ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని నారా లోకేష్‌ వారికి స్పష్టమైన హామీ ఇచ్చారు. దాంతో వారు సంతృప్తి చెంది నారా లోకేష్‌కి, టిడిపికి జైకొట్టారు. దీంతో వైసీపీ చేతిలో మిగిలిన చివరి ఆయుధాన్ని కూడా నారా లోకేష్‌ తీసేసుకొన్నట్లయింది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leader: మహిళను మంటల్లోకి తోసేసిన వైసీపీ నేత.. ఈ నాయకుడు చేసిన పనికి షాకవ్వాల్సిందే!

YSRCP Leader: ఇంటి పక్కన కాలి స్థలం విషయంలో ఓ వైసిపి నాయకుడు మహిళతో గొడవకు దిగి ఏకంగా ఆమెను మంటలలోకి తోసేసిన ఘటన గాజువాకలో చోటుచేసుకుంది. ఇలా మంటలలో పడినటువంటి ఆమె...
- Advertisement -
- Advertisement -