Jagapathi Babu: సౌందర్యతో రిలేషన్ ఉన్న మాట నిజమే: జగపతిబాబు

Jagapathi Babu: జగపతిబాబు తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఈయన కెరియర్లో ఎన్నో అద్భుతమైన కుటుంబ కథ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విపరీతమైన ఫ్యామిలీ ఆడియన్స్ సంపాదించుకున్నారు. ఈ విధంగా జగపతిబాబుకు హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని సినిమాలలో హీరోగా నటించారు. అప్పట్లో రాశి, మీనా, రోజా, సౌందర్య వంటి అగ్రతారల సరసన నటించారు.

ఇకపోతే ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సౌందర్య ఎలాంటి గ్లామర్ పాత్రలకు తావు లేకుండా ఎంతో పద్ధతిగా సినిమాలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈమె కూడా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర హీరోలందరి సరసన నటించడమే కాకుండా చిన్న హీరోలతోనూ అలాగే అలీ, బాబు మోహన్ వంటి వారి పక్కన కూడా నటించారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన సౌందర్య తన స్టార్ డమ్ పక్కన పెట్టి పెద్ద హీరోలు చిన్న హీరోలు అనే తేడా లేకుండా నటించి అందరిని మెప్పించారు.

ఇలా హీరో జగపతి బాబు సరసన కూడా పలు హిట్ సినిమాలలో నటించారు. సౌందర్య జగపతిబాబు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో చాలామంది వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని జగపతిబాబుకు సౌందర్యతో అఫైర్ ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే నటిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెంది ఇండస్ట్రీకి తీరని లోటు కలిగించిందని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు అప్పట్లో సౌందర్యతో తనకున్న రిలేషన్ గురించి వచ్చిన వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ.. అవును నిజంగానే నాకు సౌందర్యకు మధ్య రిలేషన్ ఉంది. నా దృష్టిలో రిలేషన్ అంటే ఒక మంచి సంబంధం అని అర్థం అలాగే సౌందర్యతో నాకు ఒక సోదరి సోదరుడి రిలేషన్ ఉందని ఈ సందర్భంగా సౌందర్యతో తనకున్న రిలేషన్, ఎఫైర్ గురించి జగపతిబాబు చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నేను తరచూ సౌందర్య ఇంటికి వెళ్లే వాడినని సౌందర్యతో కూడా తరచూ మా ఇంటికి రావడం వల్ల చాలామంది మా ఇద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉందంటూ ఊహించుకున్నారని ఈ సందర్భంగా జగపతిబాబు సౌందర్యతో తనకున్న సంబంధం గురించి క్లారిటీ ఇచ్చారు.

జగపతిబాబు సినీ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన లెజెండ్ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి విలన్ పాత్రలకు అద్భుతంగా సెట్ అయ్యారు. ఇకపోతే ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో విలన్ పాత్రలలో నటించడమే కాకుండా ఇంకా హీరోలకు హీరోయిన్లకు తండ్రి పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక ఈ విషయం గురించి జగపతిబాబు ఎన్నోసార్లు మాట్లాడుతూ తాను హీరోగా కన్నా విలన్ గానే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నానని వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -