Young Tiger NTR Soundarya: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు, సౌందర్యకు మధ్య ఉన్న ఈ పోలిక గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Young Tiger NTR Soundarya: దివంగత హీరోయిన్ సౌందర్య కి, జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య పోలికనా? అంటూ ఆశ్చర్యపోతున్నారా! మీరు విన్నది నిజమే. ఈ విషయం చాలామందికి తెలియదు. మరి ఎన్టీఆర్ కి సౌందర్య కి మధ్య ఉన్న ఆ పోలిక ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగు సినీ ప్రేక్షకులకు దివంగత హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె భౌతికంగా మనకు దూరమైనప్పటికీ ఆమె జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. సౌందర్య ఒక గొప్ప నటి. అప్పట్లోనే ఆమె ఎంతో మంది హీరోల సరసన నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

ముఖ్యంగా ఆమె నటన గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన హావభావాలతో ప్రేక్షకులను కట్టి పడేస్తూ ఉంటుంది. అంతే కాకుండా తన నటించిన సినిమాల్లో ఎక్కువగా స్టార్ హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్‌గా సౌందర్య రికార్డులు క్రియేట్ చేసింది. ఒకప్పటి సావిత్రి లాగా సౌందర్య కూడా సినిమాల్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. మరి ఆ తరం హీరోయిన్ సౌందర్యకి ఈ జనరేషన్ హీరో ఎన్టీఆర్ కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా.. వీరి మధ్య ఉన్న కామన్ క్వాలిటీ ఏమిటంటే వీరిద్దరూ ఐదు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతారట.

 

సౌందర్య- జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఎంతో బాగా మాట్లాడుతారు. ఈ విషయంలో సౌందర్య- జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరి మధ్య పోలిక ఉంద‌నే విషయం ఇద్దరి అభిమానుల్లో కూడా చాలా తక్కువ మందికి మాత్రమే ఈ విషయం తెలుసు. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -