RRR: నాటునాటు సాంగ్ పై జక్కన్న షాకింగ్ కామెంట్స్ వైరల్!

RRR: ఆర్ఆర్ఆర్.. ఈ పేరు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మారు మోగిపోతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా పేరు వినిపిస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా ఎన్నో అవార్డులను అందుకున్న విషయం తెలిసిందే. కలెక్షన్ల పరంగా ఎన్ని కోట్లు సాధించిందో మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఆస్కార్ అవార్డ్స్ కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో నాటు నాటు సాంగ్ ద్వారా నామినేట్ అయిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డుని కూడా దక్కించుకుంటుందా లేదా అనేది మార్చి 12 వ తేదీన తెలియనుంది.

ఈ పాటకి ఆస్కార్ అవార్డు అందుకునేందుకు అన్ని విధాలుగా అర్హత ఉంది. ఈ సాంగ్ కేవలం ఇండియా ని మాత్రమే కాదు, ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. తెలుగు బాషా రాని వాళ్ళు కూడా ఈ పాట ని స్టెప్పులేస్తూ ఇంస్టాగ్రామ్ లో రీల్స్ పెట్టేస్తున్నారు. ఒక పాట కి ప్రపంచం మొత్తం ఊగిపోవడం అనేది ఇది వరకు ఎప్పుడూ జరగలేదు. ఈ సాంగ్ కి ఈ రేంజ్ రావడానికి కారణం హీరోలే. వాళ్ళు ఆ రేంజ్ లో పోటీ పడి చెయ్యకపోయి ఉంటే ఈ సాంగ్ కి ఇంత రీచ్ వచ్చేది కాదని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ దర్శకుడు రాజమౌళి మాత్రం ఈ సాంగ్ క్రెడిట్ హీరోలకు దక్కదు అని చెబుతున్నాడు.

 

ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. నాటు నాటు పాట కి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ పాట ఈ రేంజ్ కి రావడానికి కారణం ప్రేమ్ రక్షిత్ మాస్టర్. ఆయన కంపోజ్ చేసిన స్టెప్స్ వల్లే ఈ రోజు ఆ పాటకి ఇలాంటి రెస్పాన్స్ వచ్చింది. హీరోలు ఆ స్టెప్పులను తూచా తప్పకుండా వేసి పాటని మరోలెవెల్ కి తీసుకెళ్లారు. ఆస్కార్స్ లో నామినేషన్స్ దక్కడం మా అదృష్టం, కచ్చితంగా మేము ఆ అవార్డుని గెలుచుకుంటామని బలంగా నమ్ముతున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు జక్కన్న.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -