Janasena Plan: జనసేన ప్రణాళికతో వైసీపీకి చుక్కలే.. జాగ్రత్త పడకపోతే కొంప కొల్లేరే!

Janasena Plan: జనసేన మాస్టర్ ప్లాన్ చేసిందా? వైసీపీకి ఎదురు దెబ్బలు తగలు ఉన్నాయా? వైసీపీ పరువు గంగలో కలిసిపోనుందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు అన్నది కామన్. కానీ ఇవన్నీ ఒకప్పటి సంగతులు.. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అవన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి. పెయిడ్ ఆర్టిస్ట్‌లను పెట్టుకుని, కాన్సెప్ట్ రైటర్లను పట్టకుని యూట్యూబ్ షార్ట్ లు చేసి విడుదల చేయవచ్చు. అవన్నీ నిజమని నమ్మే పామర జనం కూడా వుంటారు.

అయితే జనసేన పార్టీ సోషల్ మీడియా మరో అడుగు ముందుకు వేసి కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ సభలకు జనాలు వస్తున్నారు. అందులో సందేహం లేదు. అలాంటి సభలకు వచ్చిన కొందరు మహిళలు ప్రత్యేకంగా వీరావేశంగా జగన్‌ను దుయ్య బట్టడమో, పవన్ అంటే వీరాభిమానం ప్రకటించడమో చేస్తున్నారు. ప్రత్యేకంగా వీరి ముందు మైకులు పెడుతున్నారు. వీరు గట్టిగా మాట్లాడుతున్నారు. అయితే ఇదంతా ప్రీ ప్లాన్డ్ అని తెలుస్తోంది. జనసేన రిక్రూట్ చేసుకున్న సోషల్ మీడియా స్పెషలిస్ట్‌లు స్క్రిప్ట్ లు తయారు చేసి, దానికి తగిన వారిని ఎన్నుకుని, వాళ్లను సభా ప్రాంగణం సమీపంలోకి తీసుకెళ్లి, అప్పుడు యాక్షన్ అంటున్నారట.

 

కానీ చూసే జనాలకు మాత్రం సభలకు వచ్చిన వారి ముందు యధాలాపంగా మైక్ పెట్టినట్లు, వారు ఆవేశంగా మాట్లాడినట్లు కనిపిస్తుంది. కానీ దీని వెనుక కథ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరక్షన్ ఇలా అన్నీ వున్నాయని తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి లైవ్ వీడియోలు, యూ ట్యూబ్ షార్ట్ లుగా మారి బాగా వైరల్ అవుతాయి. జనాలు చూసి నిజంగా జగన్ కు వ్యతిరేకత పెరుగుతోంది మహిళల్లో అనుకుంటారు. తప్పు లేదు. విజయం కోసం ఎవరి ప్రయత్నాలు వారివి. ఎవరి వ్యూహాలు వారివి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -