Janasena: గోదావరి జిల్లాల్లోనే జనసేనకు ఎక్కువ సీట్లు.. ఆ రెండు జిల్లాల్లో పవన్ ప్రభంజనం ఖాయమా?

Janasena:  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో జనసేనకు 24 శాసనసభ 3 లోక్ సభ స్థానాలలో పోటీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఐదుగురు అభ్యర్థుల పేర్లను కూడా అధికారకంగా ప్రకటించారు. ఇప్పటికే ఐదు స్థానాలను ప్రకటించడం మిగిలిన స్థానాలన్నీ కూడా ఉభయ గోదావరి జిల్లాలలోనే జనసేనకు ఎక్కువగా సీట్లు కేటాయించారని తెలుస్తుంది. ఇలా ఉభయ గోదావరి జిల్లాల తర్వాత ఉత్తరాంధ్రలో జనసేన అభ్యర్థులు ఎక్కువగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయబోతున్నారని దాదాపు ఖరారు అయింది త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారికంగా ప్రకటన ఇవ్వబోతున్నారు. శాసన సభ స్థానాలలో జనసేన పోటీ చేయబోతున్నారు. ఇక అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ సోదరులు నాగబాబు పోటీ చేయబోతున్నారు. మచిలీపట్నం నుంచి బాల సౌరి కాకినాడ నుంచి సానా సతీష్ తో పాటు మరికొందరి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.

ఉమ్మడి గోదావరి జిల్లాలలో కాపులు సంఖ్య అధికంగా ఉన్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఈ రెండు జిల్లాల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఏకంగా ఆరు సీట్లు పవన్ కళ్యాణ్ అడిగారని తెలుస్తుంది. ఇలా పశ్చిమగోదావరి జిల్లాలలో భీమవరం, నరసాపురం, ఉంగుటూరు, పోలవరం తాడేపల్లిగూడెం నిడదవోలు నియోజకవర్గాలు జనసేన కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది.

ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో జనసేనకు భారీగా పట్టు ఉండడంతోనే తరచూ పవన్ కళ్యాణ్ కూడా ఈ జిల్లాలోనే పర్యటిస్తూ తన సామాజిక వర్గ నేతలను ఇన్స్పిరేషన్ చేస్తున్నారు. ఇక ఈ జిల్లాలలో కాపులు కూడా అధికంగా ఉండటంతో తాను కచ్చితంగా గెలుపొందుతానని అభిప్రాయానికి పవన్ కళ్యాణ్ వచ్చారు అందుకే ఈ జిల్లాలోనే ఎక్కువగా ప్రచార కార్యక్రమాలను చేస్తూ ఇక్కడే సీట్లను కూడా పొందుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Nandamuri Balakrishna: మాటల తూటాలు పేల్చిన బాలయ్య.. కర్నూలులో పంచ్ డైలాగ్స్ తో రేంజ్ పెంచాడుగా!

Nandamuri Balakrishna: టీడీపీ సీనియర్ నాయకుడు హిందూపురం ఎంపీ నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఈ యాత్ర కూటమి పార్టీల తరఫున చేస్తున్నారు. యాత్రలో...
- Advertisement -
- Advertisement -