Pawan Kalyan: సీఎం జ‌గ‌న్ సారా వ్యాపారి.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Pawan Kalyan: టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో చిలకలూరిపేట స‌మీపంలోని బొప్పూడిలో నిర్వ‌హించిన ప్రజాగళం భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకావటం విశేషం ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే .ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

త్వరలో జరగబోయే కురుక్షేత్ర సమరం అనంతరం ఆంధ్రాలో ఏర్పడేది రామరాజ్యమని పవన్ పేర్కొన్నారు. ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డబ్బు అధికారంతో విర్రవీగుతున్నారని ఈయన తెలిపారు. దేశం మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో ముందుకు దూసుకుపోతూ ఉండగా ఏపీలో మాత్రం మద్యం దుకాణాలలో ఇంకా నగదు చలామణి అవుతుందని ఈయన ఒక సారా వ్యాపారి అంటూ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు కురిపించారు.

ఇలా మద్యం అమ్మకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి భారీగా దోచుకున్నారని తెలిపారు. ఇక ఇసుక తవ్వకాలలో భాగంగా జగన్ బినామీలు 40 వేల కోట్ల వరకు దోచుకున్నారని ఈయన మండిపడ్డారు. రాష్ట్రం ప్రగతి బాటలో పయనించలేదని, 2019 సంవత్సరంలో రాష్ట్ర అభివృద్ధి రేటు 10.24 శాతం ఉండగా ఈసారి మూడు శాతానికి పడిపోయిందని ఈయన తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో ధర్మానిదే విజయమ‌ని, పొత్తుదే గెలుపని, కూటమిదే అధికారమ‌ని ప‌వ‌న్ నొక్కి చెప్పారు. అమరావతికి అండగా ఉంటామని చెప్పగానే మోదీ ఈ సభకు వచ్చారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వచ్చేది ఎన్డిఏ కూటమి అంటూ ఈయన ఈ కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -