Pawan Kalyan: సలహాలు ఇచ్చేసి వైసీపీలో దూకేశారు.. కాపు నేతలపై వైసీపీ సెటైర్లు మామూలుగా లేవుగా!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత సామాజిక వర్గ నేతలపై పరోక్షంగా కామెంట్లు చేశారు. తాజాగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో, జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్‌ మెడలో జనసేన పార్టీ కండువా కప్పి, జనసేన పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ .. తన సొంత సామాజిక వర్గ నేతలు అయినటువంటి హరిరామ జోగయ్య ముద్రగడ పద్మనాభం వంటి వారందరూ కూడా నాకు సలహాలు ఇచ్చారు. ఇలా నాకు సలహాలు ఇచ్చిన వారందరూ కూడా వైసిపి పార్టీలోకి దూకారు అంటూ ఈయన సెటైర్స్ వేశారు. నాకు తెలియదా ఎన్ని సీట్లు తీసుకోవాలి వీరంతా నాకు సలహాలు ఇచ్చి ఇప్పుడు అక్కడికి వెళ్లిపోయారని తెలిపారు.

జనసేనలో చేరేందుకు ప్రయత్నించి, వైసీపీలోకి చేరుతున్నారు. ముద్రగడ పద్మనాభం చేగొండి హరిరామ జోగయ్య, జనసేనకు మద్దతుగా ఉంటానని చెప్పినటువంటి ఈయన జనసేనకు చేటు కలిగించేలా ప్రెస్ నోట్ వదులుతూ తన కుమారుడిని వైసీపీ పార్టీలోకి పంపించటం గమనార్హం. అయితే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది నాయకులు ఇప్పుడు ఇలాంటి రాజకీయాలు చేయలేదని తెలిపారు.

ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయం నుంచి ఈ విధమైనటువంటి రాజకీయాలను కొందరు కాపు సామాజిక వర్గ నేతలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడు జనసేన పార్టీ మిగిలినదంతా సేమ్ టు సేమ్ అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సొంత సామాజిక వర్గ నేతలపై పరోక్షంగా వేసినటువంటి ఈ సెటైర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -