Janasena: అర్ధికంగా ఇబ్బందుల్లో జనసేన.. వచ్చే ఎన్నికల కోసం కీలక నిర్ణయం

Janasena: సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటినుంచే సిద్దమవుతున్నారు. ప్రస్తుతం సినిమాలను కూడా దూరం పెట్టి నిరంతరం ప్రజల్లోనే తిరుగుతున్నారు. ఏదోక కార్యక్రమం నిర్వహిస్తూ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కౌలు రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతు కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఇక ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను లిఖితపూర్వకంగా తెలుసుకుని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ పార్టీకి మైలేజ్ పెంచుకుంటున్నారు.

కానీ జనసేనకు ఆర్ధిక పరిస్ధితులు ఇబ్బందికరంగా ఉంటాయి. ఆర్ధిక సమస్యలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. పార్టీని నడపాలంటే కోట్లల్లో ఖర్చు అవుతుంది. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, పర్యటనలు, బహిరంగ సభలకు భారీగా ఖర్చు అవుతుంది. అయితే జనసేన పార్టీ తరపున ఆపదలో ఉన్న రైతు కుటుంబాలకు పవన్ ఆర్ధిక సాయం చేస్తున్నారు. పార్టీ సొమ్మునే ప్రజలకు సాయంగా అందిస్తున్నారు. తన సొంత డబ్బులను పవన్ ఖర్చు పెడుతున్నారు. రైతు భరోసా యాత్రలో రైతుల కుటుంబాలకు తన సొంత డబ్బునే జనసేన పార్టీ ద్వారా పవన్ అందిస్తున్నారు. పార్టీలోని ఇతర నేతలు విరాళంగా ఇచ్చినా.. అది స్వల్ప మొత్తంలోనే ఉంటుంది.

దీంతో జనసేనను ఆర్ధిక సమస్యలు వెంటాడుతున్నాయి. పార్టీలకు డబ్బులు విరాళాల ద్వారా వస్తాయి. పార్టీలోని నేతలు, సానుభూతిపరులు, కార్పొరేట్ కంపెనీలు పార్టీలకు విరాళాలు అందిస్తూ ఉంటాయి. అలాగే పార్టీలోని కార్యకర్తలు తమకు తోచినంత విరాళం ఇస్తూ ఉంటారు. జనసేన పార్టీకి విరాళం ఇవ్వడానికి చాలా సులువుగా అధికారిక వెబ్ సైట్ లో వివరాలు పొందుపర్చారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు అందించారు. పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి నెల తమకు తోచినంత పార్టీకి విరాళం ఇస్తూ ఉంటారు. అయితే ఇటీవల జనసేనకు విరాళాలు బాగా తగ్గాయి.

ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో డబ్బులు సమకూర్చుకోవాలని జనసేన భావిస్తోంది. దాని కోసం భారీగా విరాళాలు సేకరించాలని నిర్ణయం తీసుకుంది.గత ఎన్నికలకు ముందే జనసేనకు భారీగా విరాళాలు వచ్చాయి. కార్పొరేట్ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు వచ్చి పడ్డాయి. వాటిని గత ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఖర్చు చేసింది. కానీ గత ఎన్నికల్లో జనసేన ఒక సీటుకే పరిమితం కావడం, పోటీ చేసినా రెండుచోట్ల పవన్ ఓడిపోవడంతో ఆ పార్టీకి వివిధ కంపెనీల నుంచి విరాళాలు బాగా తగ్గాయి.

ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండటంతో.. ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఉంటాయి. కానీ జనసేన వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తందనే హోప్ లేకపోవడంతో విరాళాలు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారు. దీంతో జనసేనను ఆర్ధిక కష్టాలు వెంటాడుతున్నాయి. దీంతో ఎలాగైనా భారీగా విరాళాలు సేకరించి వచ్చే ఎన్నికలకు సిద్దం కావాలని పవన్ భావిస్తున్నారు. జగన్ ను అధికారంలోకి రానివ్వనని, ప్రతిపక్షాల ఓట్లు అసలు చీలనివ్వనని పవన్ గట్టిగా చెబుతున్నారు. బలమైన వైసీపీని ఎదుర్కొవాలంటే ఆర్ధిక బలం చాలా ముఖ్యం.

అందుకే టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. దాని వల్ల జనసేనకు కూడా మైలేజ్ పెరుగుతందని, విరాళాలు కూడా వచ్చే అవకాశముందని జనసేన వర్గాలు భవిస్తున్నాయి. అందుకే పవన్ పదే పదే పొత్తుల గురించి ప్రస్తావిస్తున్నట్లు చెబుతున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా పార్టీకి ఫండింగ్ కూడా పెద్దమొత్తంలో వచ్చే అవకాశముంటుందని అంచనా వేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -