Janmat Polls: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా కష్టమేనా.. జన్మత్ పోల్ లెక్కలు నిజమవుతాయా?

Janmat Polls: ఏపీలో వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దయానీయంగా మారుతుంది. పార్టీని వీడేవారి సంఖ్య పెరుగుతుంది. జగన్ ప్రచారంలో నీరసత్వం కనిస్తోంది. పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం లోపిస్తోంది. దీనికి తగ్గట్టుగానే పలు సంస్థల సర్వే ఫలితాలు కూడా చెబుతున్నాయి. ఇప్పుటే చాలా సర్వేలు వైసీపీ ఓటమి ఖాయమని తేల్చి చెప్పారు. సీఓటర్ సర్వే లాంటి క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు ఎప్పుడో ఏపీలో కూటమి గెలుపు ఖాయమని ఎప్పుడో చెప్పాయి. అన్ని సర్వే సంస్థలు కూడా వైసీపీ 45 లోపు స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పేశాయి. అయితే ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఈ సంఖ్య మరింతగా తగ్గిపోతుంది. కొన్ని సంస్థలు వైసీసీకి ప్రతిపక్షహోదా దక్కడం కూడా కష్టమేనని చెబుతున్నాయి. ఐదేళ్లుగా ఏపీలో సాగిన అరాచకపాలనే దానికి కారణమని సర్వేలు తేల్చేస్తున్నాయి. జగన పాలనలో ఏ ఒక్కవర్గం కూడా సంతోషంగా లేదని సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రజలు వైసీపీ నేతలపై, జగన్ సర్కార్ పై ఆగ్రహావేశాలతో ఉన్నారని అంటున్నాయి.. ఓటు రూపంలో సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్నారని సర్వే ఫలతాలు చెబుతున్నాయి.

తాజాగా జన్మత్ పోల్స్ అనే ఓ సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలు బయటకు వచ్చాయి. ఈ సంస్థ ఫలితాలు బట్టి.. వైసీపీ అధికారం కోసం కాకుండా.. ప్రతిపక్ష హోదా కోసం ఫైట్ చేయాల్సిందేనని తెలుస్తోంది. కూటమి పార్టీలు మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తుందని చెబుతుంది. టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేయగా.. 110 నుంచి 115 స్థానాల్లో విజయం సాధిస్తార‌ని జ‌న్మ‌త్ పోల్స్ స‌ర్వే తేల్చింది. అంటే.. టీడీపీ సింగిల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేలిపోయింది. కూటమిలో ఉన్న జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తుండ‌గా.. 17 నుంచి 19 మంది ఈ సారి అసెంబ్లీకి వెళ్తారని తెలిపింది. ఇక ఈ సర్వే ఫలితాల ప్రకారం బీజేపీ 10 స్థానాల‌కుగాను రెండు లేదా మూడు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. అధికార వైసీపీకి ఘోరఓటమి తప్పదని జ‌న్మ‌త్ పోల్స్ స‌ర్వేలో స్ప‌ష్ట‌మైంది. 175 స్థానాల్లో సింగిల్ గా పోటీ చేస్తున్న వైసీపీ 15 నుంచి 18 స్థానాల్లో మాత్ర‌మే విజ‌యం సాధిస్తుందని తెలిపింది. అంటే.. వైసీపీకి ప్రతిపక్ష హోదా రావాలంటే 18 స్థానాలు గెలవాలి. కూటమికి ఇప్పుడు ఉన్న జోరు కొనసాగితే వైసీపీ మరిన్ని స్థానాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

మొదట్లో కాంగ్రెస్‌కు, తర్వాత వైసీపీకి అండగా ఉంటూ వస్తున్న రాయలసీమ ప్రజలు కూడా ఈ సారి జగన్ కు షాక్ ఇస్తారని ఈ సర్వే తేల్చింది. 2014లో రాయలసీమలో వైసీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. 2019లో క్లీన్ స్వీప్ చేసింది. 52 స్థానాలకు గాను 49 స్థానాలు గెలుచుకుంది. ఈ సారి సీన్ రివర్స్ అవుతుందిన జన్మత్ పోల్స్ తేల్చి చెప్పింది. వివేకాహత్య కేసు ప్రభావం రాయలసీమలో ఎక్కువగా ఉంటుంది. దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సునీత, షర్మిల బలంగా కృషి చేస్తున్నారు. మొత్తానికి గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి కంటే ఘోరమైన ఓటమి ఈసారి వైసీపీ చూస్తుందని సర్వే తేల్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -