JD Lakshmi Narayana: జేడీ వైసీపిలో చేరిపోవడం ఖాయమేనా.. వైసీపీ తరపున ఆయన గెలవడం పక్కానా?

JD Lakshmi Narayana:  సీబీఐ అడిషనల్ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసిన వివి లక్ష్మినారాయణ ప్రస్తుతం తన పదవికి రాజీనామా చేసి రాజకీయాలపై దృష్టి సారించారని తెలుస్తుంది. ఇలా ఒకానొక సమయంలో సీబీఐ అడిషనల్ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసినటువంటి ఈయన జగన్‌ అక్రమస్తుల కేసులపై లోతుగా దర్యాప్తు జరిపి, సీబీఐ కోర్టులో ఏకంగా 11 చార్జ్ షీట్లు దాఖలు చేశారు. అప్పటి నుంచే ఆయన ఇంటిపేరు వివికి బదులు జేడీ లక్ష్మినారాయణగా ఫేమస్ అయ్యారు. నీతి నిజాయితీకి కట్టుబడి ఉండే అత్యంత ధైర్యవంతుడైన అధికారిగా గుర్తింపు పొందారు.

ఇకపోతే లక్ష్మీనారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి వచ్చారు. ఇలా జనసేన పార్టీలోకి వచ్చినటువంటి ఈయన విశాఖ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇలా ఓడిపోవడంతో తిరిగి జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చి యువతలో స్ఫూర్తి నింపే కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. అయితే తాజాగా శ్రీశైలంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో కూడా ఈయన పాల్గొన్నారు.

ఇలా జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జేడీ లక్ష్మీనారాయణ జగన్ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. జగన్మోహన్ రెడ్డి పట్ల ఒకప్పుడు ఎన్నో కేసులు వేసినటువంటి ఈయన ప్రస్తుతం ఆయన పాలన పట్ల ప్రశంసల కురిపించడంతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జగనన్న ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి ఈయన ఎంతో గొప్పగా మాట్లాడారు.

విద్య వైద్య రంగాలలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి మాట్లాడారు. ఇలా జగన్ ప్రభుత్వం గురించి ఈ స్థాయిలో ప్రశంసల కురిపించడంతో బహుశా ఈయన కనక వైఎస్ఆర్సిపి పార్టీలోకి రాబోతున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి ఆయన చేస్తున్నటువంటి పనుల గురించి ఈ రేంజ్ లో మాట్లాడారు అంటే తప్పనిసరిగా ఈయన వైసిపిలోకి రాబోతున్నారని అర్థం అంటూ పలువురు లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై కామెంట్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -