JD Laskhmi Narayana: జనసేనలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ?

JD Laskhmi Narayana: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తిరిగి జనసేనలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేనలో చేరేందుకు ఆయన ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఒకసారి పార్టీ నుంచి బయటకువెళ్లి పోవడంతో… మళ్లీ తిరిగి చేరడానికి లక్ష్మీనారాయణ మొహమాటం పడుతన్నారట. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా పిలిస్తే జేడీ లక్ష్మీనారాయణ జనసేనలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేసి పార్టీకి గుడ్ బై చెప్పినా పవన్ ఒక్కమాట కూడా ఆయనను అనలేదు. అది ఆయన వ్యక్తిగత నిర్ణయం అంటూ పవన్ అప్పట్లో చెప్పుకొచ్చారు.

ఇప్పటికీ లక్ష్మీనారాయణ మీద పవన్ సానుకూలంగానే ఉన్నారు. అలాంటి వాళ్లు రాజకీయాల్లోకి ఉండాలని, మార్పు కోసం కలిసి పనిచేయాలనే ఆలోచనలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే లక్ష్మీనారాయణను పవన్ మళ్లీ పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో త్వరలోనే లక్ష్మీనారాయణ మళ్లీ జనసేనలో చేరే అవవకాశాలున్నానే ఊహాగానాలు ఏపీ రాజకీయాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. జేడీ లక్ష్మీనారాయణ కూడా జనసేనలో చేరరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. త్వరలోనే పవన్ కల్యాణ్ తో లక్ష్మీనారాయణ భేటీ అవుతారని చెబుతున్నారు.

గత ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి జనసేన తరపున జేడీ లక్ష్మినారాయణ పోటీ చేశారు. వైసీపీ, టీడీపీ అభ్యర్థుల తర్వాత మూడో స్థానంలో నిలిచారు. దాదాపు 2 లక్షలకుపైగా ఓట్లు వచ్చాయి. విశాఖలో ఎడ్యుకేటెడ్ పీఫుల్ ఎక్కువగా ఉండటంతో లక్ష్మీనారాయణ పట్ల ఆకర్షితులయ్యారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొద్దిరోజులకే జనసేనకు ఆయన గుడ్ బై చెప్పారు. పవన్ తిరిగి సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయంచుకోవడంతో.. ఆయన ఫుల్ టైమ్ పొలిటీషియన్ గా ఉండటం లేదంటూ రాజీనామా లేఖలో లక్ష్మీనారాయణ ఆరోపించారు. తిరిగి సినిమాల్లోకి వెళ్లాలన్న నిర్ణయం తనకు నచ్చలేదని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

కానీ ప్రస్తుతం పవన్ సినిమాలకు దూరంగా ఉండి పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయిస్తున్నారు. ఏపీలో వరుస కార్యక్రమాలో పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నారు. జనవాణి, కౌలు రైతు భరోసా కార్యక్రమాలతో ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. టీడీపీతో సైతం పొత్తుకు సై అన్నారు. ఇటీవల ఐదేళ్ల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ భేటీ కావడంతో రాజకీయంగా మరో ముందుడుగు వేసినట్లు అయింది. ఏపీ రాజకీయ ముఖచిత్రం మారబోతుందంటూ పవన్ వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయమైనట్లు తెలస్తోంది.

దీంతో లక్ష్మీనారాయణ మళ్లీ జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ విశాఖపట్నం ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. గత ఎన్నికల తర్వాత రాజకీయాల్లో లక్ష్మీనారాయణ యాక్టివ్ గా ఉన్నారు. కౌలుకు పోలం తీసుకుని వ్యవసాయం చేయడంతో పాటు ఓ స్వచ్చంధ సంస్థ ద్వారా సామాజిక అంశాలపై ప్రచారం చేస్తోన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -