Daggubati Purandeswari: ఉద్యోగాలు లేక బిడ్డలు వలస పోతున్నారు.. చిన్నమ్మ షాకింగ్ కామెంట్స్!

Daggubati Purandeswari: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై దగ్గుబాటి పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురంధేశ్వరి ఉర‌ఫ్ చిన్న‌మ్మ‌.. మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కూడా అర్హులైన లబ్ధిదారునికి అందించకుండా.. వచ్చే నిధులను దారి మళ్ళించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలియజేశారు.

ఒకానొకప్పుడు వైసిపి ప్రభుత్వాన్ని సమర్ధించే సర్పంచుల సైతం ప్రస్తుతం బయటకు వచ్చి తమకు రావాల్సిన ఆదాయ వనరులను కూడా ప్రభుత్వం రాకుండా అడ్డుపడుతుందంటూ తమ బాధను తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు మంజూరు చేసిన వాటిని స్వలాభం కోసం వాడుకుంటున్నారని రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసారని పురందేశ్వరి వెల్లడించారు.

 

రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరగలేదని రోడ్లు మొత్తం గుంతల మయమే ఉందని, ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రాలేదని నిరుద్యోగ సంఖ్య ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోయిందని పురందేశ్వరి వెల్లడించారు. ఇక రాయలసీమ బిడ్డలు చదువుకోవాలంటే పక్క రాష్ట్రానికి వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఈమె తెలియజేశారు. ఇలాంటి ప్రభుత్వం పోయి రాష్ట్ర అభివృద్ధి చెందాలి అంటే వచ్చే ఎన్నికలలో బిజెపి గెలవాలని ఈమె హితువు పలికారు.

 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తమ ఓటు బ్యాంకు కూడా భారీగా పెరిగిందని,ఇలాంటి అరాచకపు పాలన చేసే ప్రభుత్వానికి చెక్ పెడుతూ తమ బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అంటూ ఈ సందర్భంగా పురందేశ్వరి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -