Chandrababu: పురందేశ్వరికి భారీ టాస్క్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు.. ఏం జరిగిందంటే?

Chandrababu: చంద్రబాబు నాయుడు తన చేతికి మట్టి అంటకుండా తనకు కావాల్సిన పనులన్నింటినీ కూడా ఇతరుల చేత ఎంతో చాకచక్యంగా చేయించుకుంటూ ఉంటారు. ఆ పని సక్సెస్ అయితే తనకు వందరెట్ల లాభం ఉంటుంది. ఒకవేళ ఫెయిల్ అయితే కనుక తన తప్పు ఏమాత్రం లేదని అందరికీ తెలుస్తుంది. ఇలా అందరినీ వాడుకొని ఆయన ప్రయోజనం పొందడం అనేది చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టినటువంటి విద్య అని చెప్పాలి.

ఎన్టీఆర్ ను గద్దె దింపి ఆయనని ఎంతో అవమాన పరుస్తూ తన పార్టీని చంద్రబాబు నాయుడు తన చేతులలోకి తీసుకొని ఆ పార్టీని స్థాపించింది నేనేనని ఆ పార్టీకి వారసుడిగా లోకేష్ ను నియమించడంలోనే చంద్రబాబు కుట్రబుద్ధి ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా ఈ విషయాలన్నీ పక్కన పెడితే తాజాగా పింఛన్ల విషయంలో నిమ్మగడ్డ రమేష్ ను వాడుకొని వాలంటీర్ల ద్వారా పింఛన్లను అందించడాన్ని ఆపవేశారు. అయితే ప్రజలందరూ కూడా నిమ్మగడ్డ రమేష్ ను తిట్టిపోస్తున్నారు.

ఈ విషయంలో కూడా చంద్రబాబు చేతికి మట్టి అంటుకోలేదు. అయితే తాజాగా తన వదిన బిజెపి నాయకురాలు పురందేశ్వరి వంతు వచ్చింది. పురందేశ్వరికి కూడా బాబు కీలక బాధ్యతలు అప్పగించారని తెలుస్తుంది. ఈమె బీజేపీ పార్టీలో ఉండడమే కాకుండా కేంద్రంలో బిజెపి ఉండడంతో తన సహాయంతో ఏపీలో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు అందరి పట్ల ఈమె ఈసీకి ఫిర్యాదు చేసి వారిపై చర్యలు తీసుకునేలా చంద్రబాబు పురందేశ్వరిని సిద్ధం చేశారు.

ఇప్పటికే తన మరిది చెప్పినట్టుగానే పురందేశ్వరి కూడా కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పట్ల ఈసీకి ఫిర్యాదు చేయడంతో కొంతమంది పై వేటు పడింది. త్వరలోనే మరికొందరు అధికారులపై కూడా ఈమె ఫిర్యాదు చేయబోతున్నారని వారందరి పై కూడా ఈసీ చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు తనకు ఇచ్చినటువంటి టాస్క్ పూర్తి చేయడంలో పురందేశ్వరి బాగా సక్సెస్ అవుతున్నారనే తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -