AP BJP Selling MLA Seats: ఏపీ బీజేపీలో సీట్లు అమ్ముకుంటున్నారా.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్లకే సీట్లా?

AP BJP Selling MLA Seats: ఏపీ అసెంబ్లీ ఎన్నికల త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రతి ఒక్క పార్టీలోను పెద్ద ఎత్తున రాజకీయాలు జరుగుతూ ఉన్నాయని చెప్పాలి. ఇక తెలుగుదేశం పార్టీతో జనసేన బిజెపి పొత్తు పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా భాజాపాకు కేటాయించిన సీట్లను వేలం పాట వేసి మరి అమ్ముకున్నారంటూ తాజాగా ఓ వార్త సంచలనంగా మారింది.

బిజెపి పొత్తులో భాగంగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నటువంటి తరుణంలో ఆ పార్టీకి చెందినటువంటి ఎంతో మంది సీనియర్లు తమకు టికెట్ వస్తుందని ఆశించారు కానీ పార్టీ నేతలకు కాకుండా వలస వెళ్లిన వారికే పెద్ద పీట వేస్తూ ఉండటం గమనార్హం. బిజెపి నాయకురాలు అయినటువంటి పురందేశ్వరి ముందుండి ఈ వ్యవహారం నడిపిస్తున్నారని కొంతమంది బిజెపి సీనియర్ నాయకులు ఆరోపణలను కురిపిస్తున్నారు.

సాధారణంగా ఒక పార్టీ నుంచి పోటీ చేయాలంటే పార్టీకి సేవ చేసి కష్టపడినటువంటి సీనియర్లకు మాత్రమే అవకాశం ఉంటుంది కానీ ఈసారి మాత్రం టిడిపి నుంచి బిజెపిలోకి వలస వెళ్లి పార్టీ కోసం ఏమాత్రం కష్టపడనటువంటి వారికి మాత్రమే సీట్లను ఇస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సీట్లను కూడా వేలం పాటలో భాగంగా కేటాయింపులు చేశారని విషయం బయటపడింది.

వేలంపాటలో భాగంగా ఎవరు ఎక్కువ డబ్బులకు కొనుగోలు చేసుకుంటే వారికే సీట్ అనేలా బిజెపి సీనియర్ నాయకురాలు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా వారికి అనుకూలంగా ఉన్న వారిని నిలబెట్టి కేంద్రం నుంచి వచ్చే ఎన్నికల ఫండ్ కూడా వాళ్లే పంచుకుంటున్నారు. ఈ విధంగా ఎన్నికలలో నిలబడాలి అంటే టికెట్ అవసరం అయితే ఆ టికెట్ పొందాలి అంటే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే వారికే సీట్లు అనేలా బిజెపి నేతలు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -