Vizag Drugs Case: సంధ్యా అక్వా ఎండీ వైసీపీ నేతలకే సన్నిహితుడా.. లీకైన ఫోటోలతో క్లారిటీ వచ్చేసిందిగా!

Vizag Drugs Case: ఎన్నికల సమయంలో ఏపీని డ్రగ్స్ వివాదం మలుపులు తిప్పుతుంది. విశాఖ తీరంలో డ్రగ్స్‌తో పట్టుబడిన కంటైనర్ విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విశాఖలో దొరికిన డ్రగ్స్ కు కచ్చితంగా వైసీపీకి లింక్ ఉందని టీడీపీ-జనసేన అంటున్నాయి. అయితే.. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్ కంపెనీ టీడీపీ-బీజేపీ నేతల బంధువులదే అని వైసీపీ అంటోంది. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని కంపెనీ అంటోంది. కంటైనర్ లో ఈస్ట్ ఆర్డర్ ఇచ్చామని డ్రగ్స్ ఎలా వచ్చాయో తెలియదంటోంది. అయితే.. దీని వెనక ఎవరున్నారో తేల్చడానికి సీబీఐ రెడీ అయింది. తీగ లాగితే పెద్ద కథ బయటపడేలా ఉంది.

విశాఖ పోర్టులో సీబీఐ సీజ్ చేసిన కంటైనర్ డెలివరి తీసుకున్న కంపెనీకి పురంధేశ్వరి బంధువులకు సంబంధాలు ఉన్నాయని, టీడీపీ నేతలు కావాలనే తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. డ్రగ్స్‌ నిందితులకు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయని, తప్పు చేసి రివర్స్‌లో తమపైనే ఆరోపణలు చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. అటు విదేశాల నుంచి దిగుమతి అయ్యే డ్రగ్స్ కు టీడీపీ నేతలకే లింకులు ఉంటాయని పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఓటర్లకు డబ్బులు పంచడానికే ఈ డ్రగ్స్ తెప్పించారని విమర్శించారు. సంధ్య కంపెనీపై గతంలో తమ ప్రభుత్వమే కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

వైసీపీ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా.. చాలా మంది ఈ డ్రగ్స్ వ్యవహారం వెనుక వైసీపీ హస్తం ఉందని భావిస్తున్నారు. డ్రగ్స్ దొరికిన రోజు కంటైనర్లు ఓపెన్ చేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో దీని వెనుక వైసీపీ ఉందనే ఆరోపణలకు బలం చేకూరింది. దీనికి తోడు ఆ డ్రగ్స్ వచ్చిన కంటైనర్లను ఆర్డర్ చేసిన సంధ్య ఆక్వా కంపెనీ ప్రతినిధిలకు వైసీపీ కీలక నేతలతో సంబంధాలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది. ఎంపీ విజయసాయిరెడ్డితో సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ఎండీ కూనం వీరభద్రరావు సన్నిహితంగా ఉన్న ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రకాశం జిల్లాకి చెందిన వీరభద్రరావు కుటుంబం ప్రస్తుతం వైసీపీలో ఉంది. సహకార పరపతి సంఘం త్రీమెన్ కమిటీ ఛైర్మన్ గా ఆయన సోదరుడు పూర్ణచంద్రరావును వైసీపీ ప్రభుత్వమే నియమించింది. వైసీపీ రీజినల్ కోర్డినేటర్ గా ఉన్న సమయంలో విజయసాయిరెడ్డితో ప్రస్తుత రాజకీయాలపై చర్చించానని ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పోస్టులు పెట్టారు. అంతేకాదు.. ఆయన ఊరులో విజయసాయిరెడ్డితో ఉన్న బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పూర్ణచంద్రరావు కొడుకు హరికృష్ణ, సంధ్య ఆక్వా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. 2020లో వైసీపీ ప్రభుత్వం సంధ్య ఆక్వా నుంచి కాలుష్యం వస్తుందని తనిఖీలు చేసింది. ఆ తనిఖీ తర్వాత సంధ్య ఆక్వా కంపెనీ ప్రతినిధులు వైసీపీ నేతలతో మరింత దగ్గర అయ్యారు. కరోనా టైంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆయన 50 లక్షలు విరాలం కూడా ఇచ్చారు. వీరభద్రరావుపై ఓ లైంగిక వేధింపుల కేసు కూడా ఉంది. విమానంలో తోటి ప్రయాణికురాలిని వేధించనట్టు 2016లో యూఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -