Jr NTR-Rajamouli: ఎన్టీఆర్ అభిమానులు మీసాలు మెలేసే న్యూస్ ఇదే.. జక్కన్న జూనియర్ ఎన్టీఆర్ ను అలా చూపిస్తారా?

Jr NTR-Rajamouli:  ఏంటి!జూనియర్ ఎన్టీఆర్ ను జక్కన్న అలా చూపించనున్నారా అంటే ప్రస్తుతం అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో గత ఏడాది విడుదల అయినా ఆర్ఆర్ఆర్ మూవీ గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ ను రాబట్టింది. అంతే కాకుండా ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ను పాన్ ఇండియా హీరోగా మార్చేసింది. ఇది ఇలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది వీరిద్దరి కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

కాగా ఇటీవల రాజమౌళి మేడ్ ఇన్ ఇండియా అనే సినిమాకు సమర్పికుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ పాల్కే బయోపిక్ రూపొందుతున్న ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో దాదాసాహెబ్ పాల్కే పాత్రలో ఎన్టీఆర్ నటించబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత వార్ 2 ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుని ఉన్నారు.

ఇంత బిజీగా ఉన్నప్పటికీ రాజమౌళి కోసమే మేడ్ ఇన్ ఇండియా చేయడానికి ఎన్టీఆర్ ఒప్పుకున్నారట. అంతేకాదు ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోవట్లేదు అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఇకపోతే ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -