Bandla Ganesh: వివాదాన్ని తట్టి లేపిన బండ్ల గణేష్.!

Bandla Ganesh: టాలీవుడ్ ప్రేక్షకులకు ఎన్టీఆర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి టాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. నటనలతో తాతకు తగ్గ మనవడుగా పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో హడావిడి చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే సెప్టెంబర్ 2న హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో జరగాల్సిన బ్రహ్మాస్త్రం మూవీ రిలీజ్ ఈవెంట్ అనుమతిను ఎన్టీఆర్ చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు. అప్పటినుంచి ఎన్టీఆర్ ను కేసీఆర్ గవర్నమెంట్ టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఐ లవ్ యు కేసీఆర్ సార్ అంటూ ట్విట్ చేశాడు. ఇది గమనించిన ఎన్టీఆర్ అభిమానులు ఎంతో కోపం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ ను దెప్పి పొడిచినట్లుగానే.. బండ్ల గణేష్ కేసీఆర్ కు ఐ లవ్ యు చెప్పాడని అభిమానులు తనపై అగ్గి మీద గుగ్గిళం లా ప్రవర్తిస్తున్నారు. మరోవైపు బండ్ల గణేష్ ను పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా.. ఒక రేంజ్ లో కామెంట్ల రూపంలో తిడుతున్నారు. ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని వెల్లడించారు. ఇక తాజాగా ఇదే విషయం మీద జీ తెలుగు న్యూస్ లైవ్ డిబెట్ నిర్వహించింది.

అంతేకాకుండా ఆర్టికల్స్ రూపంలో కూడా వెబ్సైట్లలో పోస్ట్ చేసింది. ఇక వెబ్సైట్ లో పబ్లిసిటీ అవుతున్న ఆర్టికల్ చూసిన బండ్ల గణేష్ స్పందించాడు. ముందు తాను కేసీఆర్ ప్రేమిస్తున్నానని తెలిపాడు. అంతకంటే ముందు తన హీరో అయిన ఎన్టీఆర్ ని కూడా ప్రేమిస్తున్నాను అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. ఇక బండ్ల గణేష్ కేసీఆర్ కు ఐలవ్యూ చెప్పడానికి కారణం ఏంటన్న దానిమీద ఎలాంటి క్లారిటీ లేదు. మరి బండ్ల గణేష్ దాని వెనక కారణం చెప్తాడో లేదో తెలుసుకోవాలి. ఏదేమైనా గణేష్ తీవ్రమైన వివాదాన్ని తట్టి లేపాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -