Jr NTR: క‌ళ్యాణ్‌రామ్ కోసం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని త్యాగం చేసిన ఎన్టీఆర్.. తారక్ నిజంగా గ్రేట్ అంటూ?

Jr NTR: నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ఇద్దరు హీరోలు చాలా సందర్భాలలో కలిసి కనిపించిన విషయం తెలిసిందే. ఇద్దరూ ఎంతో ఆప్యాయత అనురాగంతో ఉంటారు. వీరిద్దరూ కలిసి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌ర్ వరుసగా సినిమాలు నిర్మించి ఆర్థికంగా భారీగానే సంపాదించారు. ముఖ్యంగా కిక్ 2 సినిమా డిజాస్టర్ అవడంతో కళ్యాణ్ రామ్ కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తన అన్నను ఆర్థికంగా నిలబెట్టేందుకు జై లవకుశ సినిమా చేసి ఆ సినిమాతో కళ్యాణ్ రామ్ ను గట్టెక్కించేశారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ఇద్దరికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. తన అన్న కళ్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ ఒక బ్లాక్ బస్టర్ సినిమాను త్యాగం చేశారట. ఆ సినిమా మరేదో కాదు పటాస్. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన పటాస్ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా కథను మొదట ఎన్టీఆర్ కి వినిపించాడట. ఈ సినిమాను తప్పకుండా తన బ్యానర్ లో నిర్మిస్తాన అయితే నాకంటే మరో పెద్ద హీరోతో చేస్తే బాగుంటుందని కళ్యాణ్ రామ్ చెప్పారు. ఇక‌ ఎన్టీఆర్‌కు కూడా ఇదే క‌థ వినిపించారు.

అయితే కథ విన్న ఎన్టీఆర్ ఈ కథలో కళ్యాణ్‌రామ్ మాత్రమే నటించాలని.. తాను ఇప్పటికే టెంపర్ సినిమాలో పోలీస్ పాత్ర చేస్తున్నానని కళ్యాణ్ రామ్‌కు ఖచ్చితంగా హిట్ కావలసిన సమయం ఇది అని అనిల్ రావిపూడి కి చెప్పారుట. అటు అనిల్ రావిపూడి కూడా కళ్యాణ్ రామ్ తోనే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. తనకు దర్శ‌కుడిగా తొలి ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ తోనే సినిమా చేసి హిట్టు కొడతానని ముందే చెప్పేశాడు. అన్నట్టుగానే పటాస్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు కళ్యాణ్ రామ్ కెరీర్ కు మంచి ఊపు తెచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -