Jr NTR: బాలయ్య హీరోయిన్ కి ఆ విధంగా హెల్ప్ చేసిన జూనియర్ ఎన్టీఆర్!

Jr NTR: టాలీవుడ్ ప్రేక్షకులకు అప్పటి అందాల భామ రాధ గురించి అందరికీ తెలిసిందే. ఇక సీనియర్ నటి రాధ, బాలకృష్ణ కాంబినేషన్ అప్పట్లో బాగానే పండింది. వీరిద్దరి కాంబినేషన్లో అప్పట్లో నాలుగు సినిమాలు వచ్చాయి. అలా బాలకృష్ణ కు రాధకు అప్పటి నుంచి గట్టి స్నేహం ఏర్పడింది. ఇక ఆ తర్వాత కొంతకాలానికి రాధ సినిమాలకు పూర్తిగా దూరమైంది.

పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయిపోయింది. ఈమె కేరళకు చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు కార్తీక, తులసి తోపాటు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే రాధ తన ఇద్దరు కూతుర్లను ఇండస్ట్రీలో హీరోయిన్లుగా పరిచయం చేయడానికి చాలా కష్టపడింది. పెద్ద కుమార్తె కార్తీక.. రంగం సినిమాలతో అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా తో కార్తీకకు మంచి ఫేమ్ వచ్చింది . ఇక రెండో కుమార్తె తులసి మణిరత్నం కడలి సినిమాలో నటించింది.

ఆ తర్వాత తులసి మరే సినిమాలో కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక ఇదే విధంగా కార్తీక కూడా కెరీర్ పరంగా చాలా వెనుకబడిపోయింది. రాధ మాత్రం కార్తీకను ఎలాగైనా తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా చేయాలని చాలా పట్టు పట్టింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ను మీ సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని రాధ ఎన్టీఆర్ ను కోరిందట. ఇక రాధ స్వయంగా అడగడంతో జూనియర్ ఎన్టీఆర్ మాట తీసేయలేకపోయాడు.

అప్పట్లో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమాలో కార్తీక కు హీరోయిన్ గా ఛాన్స్ ఎన్టీఆర్ ఇప్పించారని తెలిసింది. ఇక దమ్ము సినిమాలో ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీకలు మెప్పించారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఇక తన తల్లి బాగా కష్టపడినప్పటికీ కార్తీక విషయంలో కొంచెం కూడా ఫలితం దక్కలేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాధ స్వయంగా అడగడంతో తన సినిమాలో కార్తీకకు ఆఫర్ ఇచ్చి మంచి హెల్ప్ చేసాడు.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -