Junior NTR: భార్యపై ప్రేమతో 100 తులాల బంగారం చేయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే?

Junior NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి జోడి కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తారక్ కెరియర్ పరంగా భారీ విజయాలని అందుకోవటంలో లక్ష్మీ ప్రణతి పాత్ర కూడా ఉందని తారక్ అభిమానులు భావిస్తారు. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ తారక్ నటించిన సినిమాలు బాగానే చూస్తారు. అలాగే తారక్ కి కూడా లక్ష్మీ ప్రణతి అంటే ఎంత ఇష్టమో ఆయన మాటలు, ఆయన ఇంటర్వ్యూల ద్వారా మనకి తెలిసిన విషయమే.

ఆ మధ్యకాలంలో ఆరున్నర ఎకరాల ఫామ్ హౌస్ ని భార్యకి బహుమతిగా ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అతనికి కెరియర్ లోనే మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా బృందావనం పేరునే ఆ ఫామ్ హౌస్ కి పెట్టడంతో లక్ష్మీ ప్రణతి ఆనందానికి అవధులు లేవు. దీంతో తారక్ కి భార్యపై ఎంత ప్రేమ అంటూ నేటిజెన్లు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అలాగే మరో సందర్భంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన భార్యపై ప్రేమతో ఏకంగా 100 తులాల బంగారం చేయించారని తెలుస్తోంది.

 

భార్యపై ప్రేమను చూపించే విషయంలో తారక్ కు ఎవరూ సాటిరారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బంగారం విషయం పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన బృందావనం ఫోటోలు బయటకు వస్తే బాగుండు అని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆయన కెరియర్ విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో హిట్ కొట్టిన ఎన్టీఆర్ తన 30వ సినిమా అని కొరటాల శివ చేతిలో పెట్టాడు.

 

ఇందులో అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా మీద భారీ అంచనాలనే పెట్టుకున్నారు ఎన్టీఆర్ అభిమానులు ఎందుకంటే డైరెక్టర్ కి కూడా అంత క్రేజ్ ఉంది మరి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -