Young Tiger: అండర్ వాటర్ ట్రైనింగ్ తీసుకుంటున్న యంగ్ టైగర్.. ఆ విషయంలో తారక్ ను కొట్టేవారు లేరా?

Young Tiger: రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఆచార్య సినిమా వరకు తన సినీ కెరియర్లో డిజాస్టర్ ఎరుగని కొరటాల శివ ఆచార్య సినిమాతో డిజాస్టర్ సినిమాని మూట కట్టుకున్నారు. ఈ సినిమా తప్పు మొత్తం కొరటాలదే అన్న వాదనలు కూడా వినిపించాయి. ఇలా తనపై వచ్చినటువంటి ఈ మార్క్ తుడిచేయడం కోసం కొరటాల చాలా కసితో దేవర సినిమా షూటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఏ మాత్రం హడావుడి లేకుండా హంగు ఆర్భాటాలు లేకుండా చాలా సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుతున్నారు. ఇక రాజమౌళి సినిమా చేసిన తర్వాత మరొక సినిమా చేస్తే ఆ హీరో సినిమా డిజాస్టర్ అనే ఒక సెంటిమెంట్ కూడా ఉంది అయితే ఈ సెంటిమెంట్ ఈసారి బ్రేక్ చేసే దిశగా ఎన్టీఆర్ కూడా కసితో ఈ సినిమా చేస్తున్నారు. అయితే శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్నటువంటి ఈ సినిమా ఎక్కువగా సముద్రం బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.

 

సముద్రంపై కీలక సన్నివేశాలు ఉన్నాయి అలాగే అండర్ వాటర్ లో కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం ఎంత సీజీ వర్క్ ఉన్నప్పటికీ కొంతైనా రియాలిటీగా షూట్ చేయాలన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ అండర్ వాటర్ సన్నివేశాలలో నటించడం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తుంది.

 

ఈ విధంగా అండర్ వాటర్ లో నటించడం కోసం ఎన్టీఆర్ కు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడానికి ముంబై నుంచి కొందరు ట్రైనర్స్ ఇక్కడికి వచ్చారని సమాచారం. ఇలా ప్రత్యేక నిపుణుల సమక్షంలో ఎన్టీఆర్ ఈ శిక్షణ తీసుకుంటున్నారని ఈ సినిమా కోసం ఈయన భారీ స్థాయిలో కష్టపడుతున్నారని తెలుస్తోంది. ఇలా ఎంతో కసిగా పట్టుదలగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి సెలవులలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -