Lakshmi Pranathi: తమ్ముడికి ప్రేమతో రాఖీ కట్టిన లక్ష్మీ ప్రణతి.. తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Lakshmi Pranathi: ప్రస్తుతం రక్షాబంధన్ కావడంతో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలకు వారి పిల్లలకు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. చిన్న పెద్ద సామాన్యులు సెలబ్రిటీలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఈ రక్షాబంధన్ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నందుకుగాను అక్కలకు చెల్లెళ్లకు అన్నదమ్ములు మంచి మంచి బహుమతులు ఇస్తున్నారు.

కాగా తాజాగా పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కూడా తన తమ్ముడు నార్నే నితిన్ కి రాఖీ కట్టిందట. ఇక రాఖీ కట్టినందుకుగా నార్నే నితిన్ తన అక్క లక్ష్మీ ప్రణతికి ఒక విలువైన డైమండ్ రింగ్ ఉన్న బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఇక ఆ సంగతి పక్కన పెడితే నార్నే నితిన్ త్వరలోనే హీరోగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.. మొదటి సినిమా ఇంకా విడుదల కాకముందే అప్పుడు రెండు మూడు ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. లక్ష్మీ ప్రణతి భార్య జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే..

 

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దేవర సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ మూవీ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -