Kalyan Ram: నెక్స్ట్ లెవెల్ నటనతో కళ్యాణ్ రామ్.. ఎలా ఉందంటే?

Kalyan Ram: బింబిసార సినిమాతో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అద్భుత విజయాన్ని అందుకున్నారు. చాలా రోజుల తర్వాత కళ్యాణ్ రామ్ కు ఆ సినిమా ద్వారా మంచి సక్సెస్ వచ్చిందని చెప్పాలి. త్వరలోనే బింబిసార2 సినిమా కూడా రానుందని కళ్యాణ్ రామ్ ఇదివరకే చెప్పారు. ఇదిలా ఉండగా నేడు కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ అనే సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ చూస్తుంటే ఈ సినిమా కథ కూడా అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తోంది.

 

 

అమిగోస్ టీజర్ లో హీరో కళ్యాణ్ రామ్ ఒక్కరుగా కాకుండా ట్రిబుల్ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇందలో కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగులు ఫ్యాన్స్ కు బాగా కనెక్టింగ్ గా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించి కళ్యాణ్ రామ్ రెండు పాత్రలైన సిద్దార్ధ్ అనే ఎంటర్‌ప్రెన్యూర్‌, మంజునాథ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ క్యారెక్టర్స్ ను చిత్ర యూనిట్ పరిచయం చేసింది.

 

టీజర్‌లో మూడో పాత్ర అయిన మైఖేల్‌ను కూడా చూపిస్తూ సినిమాపై అంచనాలను చిత్ర యూనిట్ పెంచిందని చెప్పాలి. సినిమాలో మైఖేల్ క్యారెక్టర్ అనేది ఒక గ్యాంగ్ స్టర్ గా ఉండనుంది. అలాగే తనలా ఉన్న మరో ఇద్దర్ని మైఖేల్ వెతికి పట్టుకుంటాడు. ఈ మూవీలో హీరో కమ్ విలన్ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపిస్తుండటం విశేషం.

 

ఇకపోతే కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో మూడు పాత్రల్లో మూడు డిఫరెంట్ మ్యానరిజం‌లో కనిపించి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించనున్నాడు. తాజాగా ఆయన బింబిసారలో కూడా రెండు విభిన్న పాత్రల్లో కనిపించారు. డిఫరెంట్ కథాంశాలను ఎంపిక చేసుకుంటూ కళ్యాణ్ రామ్ ముందుకు దూసుకుపోతున్నాడు. బింబిసార2 కు సంబంధించి కూడా త్వరలోనే అప్ డేట్ రానుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -