Kantara: దీపావళి సినిమాలకు గట్టి పోటీ ఇవ్వబోతున్న కాంతార?

Kantara: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి విడుదలైనటువంటి కాంతారా సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా. సెప్టెంబర్ 31వ తేదీ కన్నడ చిత్ర పరిశ్రమలో విడుదల కాగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అన్ని భాషలలో ఈ సినిమా విడుదలైంది.

తెలుగులో కూడా ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేయగా భారీగా లాభాలను అందుకుంటున్నారు. ఈ సినిమా విజయంతో సినిమాకు భాష ముఖ్యం కాదని కంటెంట్ మాత్రమే మరోసారి నిరూపించింది. ఇక ఈ సినిమా తెలుగులో అక్టోబర్ 15వ తేదీ విడుదల అయినప్పటికీ ఇంకా కలెక్షన్ల విషయంలో ఏమాత్రం స్పీడ్ తగ్గలేదని తెలుస్తోంది. ఈ విధంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టడంతో మరి కొంతమంది దర్శక నిర్మాతలలో కాస్త ఆందోళన నెలకొంది.

దీపావళి పండుగను పురస్కరించుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే ఈ యంగ్ హీరోలు అందరూ కూడా పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే దీపావళి పండుగను పురస్కరించుకొని విడుదల కాబోయే ప్రిన్స్, ఓరి దేవుడా, జిన్నా,సర్దార్ వంటి సినిమాలకు కాంతార సినిమా కూడా గట్టి పోటీ ఇవ్వబోతుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా భారీగా బిజినెస్ జరుపుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదే సమయంలోనే యంగ్ హీరోల సినిమాలు విడుదల కావడంతో ఆ హీరోల సినిమాలపై కాంతార సినిమా భారీ ఎఫెక్ట్ చూపించబోతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కలెక్షన్ల విషయంలో కాంతార సినిమా ఆ సినిమాలపై దెబ్బ కొట్టే ప్రభావం ఉందని నిపుణులు అభిప్రాయం. మరి ఈ సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -