Rishab Shetty: రిషబ్ శెట్టి లవ్ స్టోరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సినిమా చేయొచ్చు తెలుసా?

Rishab Shetty: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా కాంతర సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతోమంది ఆదరాభిమానాలను సొంతం చేసుకుంటుంది. ఇక ఈ సినిమా కేవలం కన్నడలో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఏకంగా వందల కోట్ల కలెక్షన్లను రాబట్టి అందరికీ ఎంతో స్ఫూర్తిగా నిలిచింది.

ఇలా ఈ సినిమాలో నటించిన రిషబ్ శెట్టి దర్శకుడిగా హీరోగా కన్నడ చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.కెరియర్ పరంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన ఈయన ప్రగతి శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరిది ప్రేమ వివాహం. మరి వీరి లవ్ స్టోరీ కనుక తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే.

2016 వ సంవత్సరంలో రిషబ్ శెట్టి ప్రగతిల పరిచయం ఒక సినిమా ఈవెంట్ ద్వారా జరిగింది.ఈ ఈవెంట్ తో ప్రగతి పరిచయం ఏర్పడటంతో ఇంటికి వెళ్లి ఆయన ఫేస్ బుక్ సెర్చ్ చేశారు. అప్పటికే ప్రగతి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడంతో తన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి అప్పటినుంచి ఇద్దరూ చాటింగ్ చేసుకొని మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

ఇక ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇదే విషయమే ప్రగతి శెట్టి కుటుంబ సభ్యులకు చెప్పడంతో ప్రగతి తల్లిదండ్రులు ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు.రిషబ్ శెట్టి కేవలం సినిమాలలో పనిచేస్తున్నారనే ఒక కారణంతోనే ఈ పెళ్లికి ప్రగతి తల్లితండ్రులు ఒప్పుకోలేదు. అయితే ఈమె తన తల్లిదండ్రులను పోర్స్ చేయడం వల్ల చివరికి తన తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోవడంతో 2020 సంవత్సరంలో వీరి వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -