Kapu Community: కాపు సామాజిక వర్గానికి కొత్త శత్రువులు అక్కర్లేదా.. ఆ పార్టీకి సొంతవాళ్లే శత్రువులా?

Kapu Community: ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా రెడ్డి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే పరిపాలన కొనసాగించారు. అయితే మొదటిసారి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడు ప్రజల ముందుకు వచ్చారు. ఎలాగైనా ఈయనని గెలిపించుకొని కాపు నాయకులు కూడా పరిపాలన కొనసాగించాలి అన్న ధోరణిలో ఇన్ని రోజులు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నారు.

గతంలో కూడా ఎంతోమంది సీనియర్ కాపు నాయకులు రాజకీయాలలో కొనసాగిన ఎవరూ కూడా ముందడుగు వేయలేదు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గెలిపించుకోవడానికి కొంతమంది కాపు నేతలు పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపట్టారు అయితే ఈయన టిడిపి పార్టీతో పొత్తు పెట్టుకుని కేవలం 24 సీట్లు మాత్రమే తీసుకున్నారు అనే విషయం తెలియడంతో ప్రముఖ కాపు నేతలు అయినటువంటి హరి రామ జోగయ్య కుమారుడు కూడా స్వయంగా వైసీపీలోకి చేరిపోయారు.

ఇక కాపు రాజకీయ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ్డ పద్మనాభం మొదటి నుంచి వైసీపీ పార్టీకి మద్దతు తెలిపారు. మధ్యలో ఈయన జనసేనకు సపోర్ట్ చేసినట్టే కనిపించిన ఈయన మాత్రం వైసిపి గూటికి చేరారు. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కూడా పరిపాలన కొనసాగించాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ కాపు యువతను రెచ్చగొట్టి తిరిగి ఈ సో కాల్డ్ కాపు నేతలు వేరే పార్టీకి చేరడంతో అర్థమేంటి ఈ రాష్ట్రంలో కాపులకు పెద్ద శత్రువులు ఎక్కడ లేరు స్వయంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే శత్రువులుగా మారిపోయారని తెలుస్తోంది.

ఇలా వైసిపి పార్టీ కాపు సామాజిక వర్గంలో యువత మధ్య పెద్ద ఎత్తున చిచ్చు పెడుతోంది. అది కూడా పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఇలా చేయడం వల్ల నష్టపోయేది ఎవరు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సి ఉంటుందని తెలిపారు. సొంత సామాజిక వర్గానికి మద్దతు తెలిపితే సమాజానికి మంచి కలుగుతుంది లేదంటే అల్లరిమూక అనే పేరును మాత్రమే పొందాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఏది ఏమైనా వైసీపీ నేతల అతి తెలివితేటలతో సొంత సామాజిక వర్గానికి చెందిన వారికి అదే వర్గానికి చెందిన వారిని శత్రువులుగా మార్చేసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -